ఏ సమస్యకైనా సాంకేతిక పరిజ్ఞానం పరిష్కారం చూపుతుందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. లాక్‌డౌన్‌లో భౌతికదూరం పాటిస్తూనే డిజిటల్ సోషలైజేషన్ దిశగా అడుగులేద్దామన్నారు. ఈసారి జరుగుతున్న డిజిటల్ మహానాడు-2020 కూడా అటువంటిదేనని చంద్రబాబు అన్నారు. ఏటా అసంఖ్యాక జనసందోహం మధ్య జరిగే మహానాడు వేడుక .. లాక్‌డౌన్ నిబంధనల వల్ల డిజిటల్ మహానాడుగా మారిందన్నారు. ఈ వేడుక చేసుకునేందుకు జూమ్ వెబినార్ సాంకేతికత ఓ మార్గం చూపిందన్నారు.
మహానాడు- 2020.. దేశంలోనే మొదటి డిజిటల్ రాజకీయ సమావేశంగా నిలుస్తుందని చంద్రబాబు అన్నారు. తెదేపా నాయకులు, కార్యకర్తలంతా డిజిటల్ మహానాడులో పాల్గొనాలని ట్విట్టర్లో పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి : భారత వైమానిక దళంలోకి 'ఫ్లయింగ్ బుల్లెట్లు'