CBN FIRE: ఆంధ్రప్రదేశ్‌లోని కుప్పంలో ఓ హోటల్‌పై వైకాపా కౌన్సిలర్ల దాడిని తెదేపా అధినేత చంద్రబాబు ఖండించారు. కుప్పంలో ఎన్నడూ లేని దాడుల సంస్కృతిని వైకాపా తీసుకొచ్చిందని ధ్వజమెత్తారు. భోజనం అయిపోయిందని చెప్పిన హోటల్ సిబ్బందిపై.. వైకాపా నాయకులు దాడి చేయడం దారుణమన్నారు. ఫర్నీచర్ ధ్వంసం చేసి మహిళలను బెదిరించిన వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
"హోటల్ తగలబెడతాం, నిర్వాహకులను చంపేస్తాం అంటూ బెదిరిస్తుంటే.. పోలీసులు ఏం చేస్తున్నారు" అని చంద్రబాబు నిలదీశారు. కఠిన చర్యలతో క్రిమినల్ కార్యకలాపాలకు ముగింపు పలకాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని గుర్తు చేశారు. బాధిత కుటుంబానికి తెలుగుదేశం అండగా ఉంటుందని ట్విట్టర్ వేదికగా భరోసా ఇచ్చారు.
-
ఫర్నిచర్ ధ్వంసం చేసి,మహిళలను బెదిరించడం పై పోలీసులు తక్షణ చర్యలు తీసుకోవాలి.హోటల్ నిర్వాహకులను చంపేస్తాం...హోటల్ తగలబెడతాం అంటే పోలీసులు ఏం చేస్తున్నారు? కఠిన చర్యలతో క్రిమినల్స్ యాక్టివిటీకి ముగింపు పలకాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది.బాధిత కుటుంబానికి తెలుగుదేశం అండగా ఉంటుంది(2/2)
— N Chandrababu Naidu (@ncbn) May 16, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">ఫర్నిచర్ ధ్వంసం చేసి,మహిళలను బెదిరించడం పై పోలీసులు తక్షణ చర్యలు తీసుకోవాలి.హోటల్ నిర్వాహకులను చంపేస్తాం...హోటల్ తగలబెడతాం అంటే పోలీసులు ఏం చేస్తున్నారు? కఠిన చర్యలతో క్రిమినల్స్ యాక్టివిటీకి ముగింపు పలకాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది.బాధిత కుటుంబానికి తెలుగుదేశం అండగా ఉంటుంది(2/2)
— N Chandrababu Naidu (@ncbn) May 16, 2022ఫర్నిచర్ ధ్వంసం చేసి,మహిళలను బెదిరించడం పై పోలీసులు తక్షణ చర్యలు తీసుకోవాలి.హోటల్ నిర్వాహకులను చంపేస్తాం...హోటల్ తగలబెడతాం అంటే పోలీసులు ఏం చేస్తున్నారు? కఠిన చర్యలతో క్రిమినల్స్ యాక్టివిటీకి ముగింపు పలకాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది.బాధిత కుటుంబానికి తెలుగుదేశం అండగా ఉంటుంది(2/2)
— N Chandrababu Naidu (@ncbn) May 16, 2022
అసలేమైందంటే..: కుప్పం పట్టణం బైపాస్ మార్గంలోని ఓ దాబాలో వైకాపా నాయకులు వీరంగం సృష్టించిన సీసీ ఫుటేజీ వీడియో ఆదివారం సామాజిక మాధ్యమాల్లో వైరలైంది. కుప్పం మున్సిపాలిటీకి చెందిన ఓ కౌన్సిలర్, మరో కౌన్సిలర్ కుమారుడు, వారి అనుచరులు దాబాపై దాడి చేసినట్లు నిర్వాహకులు తెలిపిన విషయం తెలిసిందే.
ఇవీ చదవండి..: