ETV Bharat / city

జగన్ పాలనలో ప్రశ్నించే గొంతుకకు సంకెళ్లే బహుమతా?: చంద్రబాబు - MP Raghu Rama Arrest News

ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టుపై తెదేపా అధినేత చంద్రబాబు హాట్ కామెంట్స్ చేశారు. రఘురామని అరెస్ట్ చేయించటం జగన్ రెడ్డి మూర్ఖత్వానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. అక్రమ కేసులు, అరెస్టులకు వెచ్చించిన సమయంలో కొంతైనా కరోనా నియంత్రణపై పెడితే ప్రజలు ప్రాణాలు కోల్పోయేవారు కాదని... ప్రజా కోర్టులో జగన్ తప్పించుకోలేరని హెచ్చరించారు.

Chandrababu Condemn MP Raghu Rama Arrest

author img

By

Published : May 14, 2021, 10:07 PM IST

కరోనా వైఫల్యాలు, అమూల్ విషయంలో రైతుల హక్కుల గురించి ప్రశ్నించిన ఎంపీ రఘురామకృష్ణరాజుపై దేశ ద్రోహం కేసు పెట్టినందుకు జగన్ ప్రభుత్వం సిగ్గుపడాలని... తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఘాటుగా విమర్శించారు. ఇది అధికార దుర్వినియోగమేనని ధ్వజమెత్తారు. ప్రజా కోర్టులో జగన్ తప్పించుకోలేరని హెచ్చరించారు.

ప్రజా సమస్యలు లేవనెత్తుతున్న రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేయించటం జగన్ రెడ్డి మూర్ఖత్వానికి నిదర్శనం. ప్రశ్నకు సమాధానం అరెస్టా? ప్రశ్నించే గొంతుకకు సంకెళ్లే బహుమానంగా ఇస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. కరోనా నియంత్రణపై దృష్టి పెట్టకుండా విమర్శకుల అణచివేతపై సీఎం సమయం వృథా చేస్తున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారు. స్పీకర్ అనుమతి లేకుండా వై కేటగిరీ భద్రతలో ఉన్న ఎంపీని ఎలా అరెస్టు చేస్తారు? హిట్లర్, గడాఫీ వంటి నియంతల పాలనలో ప్రశ్నించిన వారిని అడ్డగోలుగా అరెస్టు చేసినట్లు రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయి. అక్రమ కేసులు, అరెస్టులకు వెచ్చించిన సమయంలో కొంతైనా కరోనా నియంత్రణపై పెడితే ప్రజలు ప్రాణాలు కోల్పోయేవారు కాదు. ఆక్సిజన్, మందులు, వ్యాక్సిన్ కోసం ప్రజలు అల్లాడుతుంటే కక్ష సాధింపుపై దృష్టి సారించడం దుర్మార్గం. తెలంగాణ సరిహద్దుల్లో అంబులెన్స్​లు నిలిపివేస్తుంటే కనీసం మాట్లాడని జగన్మోహన్ రెడ్డి, సీఐడీ పోలీసుల్ని హైదరాబాద్ పంపించి అరెస్టులు చేయిస్తారా?

- చంద్రబాబు

ఇదీ చదవండి: 'త్వరగా రాష్ట్ర ప్రజలకు వ్యాక్సిన్ అందించేందుకు సర్కారు కృషి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.