ETV Bharat / city

అప్పుడు నేను చేసిన అభివృద్ధి ఫలాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి: చంద్రబాబు

ఏపీ పునర్నిర్మాణంలో ప్రజలు భాగస్వాములు కావాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. హైదరాబాద్​లోని ఎన్టీఆర్ భవన్​లో నిర్వహించిన పార్టీ 40వ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న ఆయన... సమాజ హితం కోరుకునేవారు, శక్తి సామర్థ్యాలు ఉన్నవారు రాజకీయాల్లోకి రావాలని అన్నారు. యువతను ప్రోత్సహించాలని తెదేపా నిర్ణయం తీసుకుందని.., వచ్చే ఎన్నికల్లో యువతకు 40 శాతం సీట్లు కేటాయిస్తామని చెప్పారు.

http://10.10.50.85:6060///finalout4/andhra-pradesh-nle/finalout/29-March-2022/14873897_cbn.JPG

author img

By

Published : Mar 29, 2022, 10:28 PM IST

'యువతను ప్రోత్సహిస్తాం.. వచ్చే ఎన్నికల్లో వారికి 40 శాతం సీట్లు వాళ్లకే..'

స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగువారి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పారని తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు. తెలుగుజాతి ఉన్నంత వరకు ప్రజల గుండెల్లో ఎన్టీఆర్‌ ఉంటారన్నారు. హైదరాబాద్​లోని ఎన్టీఆర్ భవన్​లో నిర్వహించిన పార్టీ 40వ ఆవిర్భావ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా మాట్లాడిన ఆయన.. తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల గుండె చప్పుడు అని అన్నారు. ప్రతి ఒక్కరి రక్తంలో తెలుగుదేశం పార్టీ ఉందని.., ప్రజల నరనరాల్లో తెదేపా జీర్ణించుకుపోయిందన్నారు.

21 ఏళ్లు అధికారంలో, 19 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నా.. తమది ప్రజాపక్షమేనని చెప్పారు. నవతరానికి నాంది పలికిన గొప్పవ్యక్తి ఎన్టీఆర్‌ అని కొనియాడారు. పటేల్‌-పట్వారీ వ్యవస్థను రద్దు చేసి మహిళలకు ఆస్తిలో సమాన హక్కులు తీసుకువచ్చిన ఘనత ఎన్టీఆర్​కే దక్కుతుందన్నారు. మహిళలకు రిజర్వేషన్లు వచ్చాక రాజకీయాల్లోకి వస్తున్నారన్నారు. వెనకబడిన వర్గాలకు తమ పార్టీ ప్రాతినిధ్యం ఇచ్చిందని గుర్తు చేశారు. యువతను ప్రోత్సహించాలని తెదేపా నిర్ణయం తీసుకుందని.., వచ్చే ఎన్నికల్లో యువతకు 40 శాతం సీట్లు కేటాయిస్తామని చెప్పారు.

"గ్రామ కమిటీ నుంచి ప్రతి ఒక్క కార్యకర్త వేడుకలు చేస్తున్నారు. ప్రపంచ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా పార్టీ ఆవిర్భావ వేడుకలు. 40 దేశాల్లో 200 నగరాల్లో తెదేపా ఆవిర్భావ వేడుకలు. 40 ఏళ్లుగా పార్టీ కొనసాగడం అరుదైన అవకాశం. అధికారం కోసం ఎన్టీఆర్‌ పార్టీ ఏర్పాటు చేయలేదు. తెలుగువారి సంక్షేమమే తెదేపా పరమావధి. తెలుగుజాతికి పునరంకితం కావాల్సిన సమయం వచ్చింది."- చంద్రబాబు తెదేపా అధినేత

దూరదృష్టితో ఆలోచించాం: తెదేపా హయాంలోనే విజన్‌ 2020 తీసుకువచ్చానని చంద్రబాబు అన్నారు. తెదేపా దూరదృష్టితో నాలెడ్జ్‌ అకాడమీకి ప్రాధాన్యం ఇచ్చిందని తెలిపారు. బయోటెక్నాలజీకి ప్రాధాన్యం ఉందని ముందే గ్రహించామని చెప్పారు. తెదేపా హయాంలో జీనోమ్‌ వ్యాలీకి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. జీనోమ్‌ వ్యాలీ నుంచి కరోనా టీకా రావడం దేశానికి గర్వకారణమని అన్నారు. హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్‌ కేంద్రం ఏర్పాటుకు కృషిచేశానని తెలిపారు. శంషాబాద్‌లో విమానాశ్రయం తీసుకువచ్చామని..,అభివృద్ధి ఎవరు చేసినా ముందుకు తీసుకెళ్లాలని అన్నారు.

"33 వేల ఎకరాల్లో రాజధాని ఏర్పాటుకు కృషిచేశా. రాజధాని కోసం రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు. అమరావతిలో ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ జరిగింది అన్నారు. నాపై ఉన్న నమ్మకంతో రైతులు భూములు త్యాగాలు చేశారు. తెలుగు ప్రజలు పేరు ప్రఖ్యాతలు పొందాలని కోరుకున్నాం. హైదరాబాద్‌లో అడుగడుగునా నా కష్టం సత్ఫలితాలు ఇస్తోంది. గోపీచంద్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీ ఏర్పాటుకు సహకరించాం. గోపీచంద్‌ అకాడమీ నుంచి ఛాంపియన్లు వస్తున్నారు. పలు సాగునీటి ప్రాజెక్టులు తెదేపా హయాంలోనే కట్టాం. పోలవరం ద్వారా నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టాం. నదుల అనుసంధానంతో అందరికీ నీళ్లివ్వాలని తలపెట్టాం." - చంద్రబాబు, తెదేపా అధినేత

అలాంటి వారు రాజకీయాల్లోకి రావాలి: యువత గర్వంగా పనిచేయాలంటే తెదేపా ఉండాలి అని చంద్రబాబు అన్నారు. యువత ముందుకు వచ్చి పోరాడాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. సమాజ హితం కోరుకునేవారు రాజకీయాల్లోకి రావాలన్నారు. శక్తి సామర్థ్యాలు ఉన్నవారు రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. సంపద సృష్టించడంలో తెదేపా ముందుందని..,రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రజలు భాగస్వాములు కావాలని అన్నారు.

"తెదేపా కుటుంబంలో 70 లక్షల మంది సభ్యులు ఉన్నారు. తెదేపాను నమ్ముకున్న వారంతా నా కుటుంబసభ్యులే. పార్టీని కాపాడింది.. జెండా మోసింది కార్యకర్తలు. కార్యకర్తలపై దాడులు జరిగినా జెండా వదల్లేదు. కార్యకర్తల రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. కార్యకర్తల కోసం రూ.వంద కోట్ల బీమా తీసుకువచ్చాం. బీమాతో పాటు కార్యకర్తల ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నా. కార్యకర్తలను ఆదుకోవడం బాధ్యతగా భావిస్తున్నా. కార్యకర్తల సాధికారత.. ఆర్థికంగా ఎదిగేందుకు కృషిచేస్తా. కొండనైనా బద్దలు కొట్టే శక్తి తెదేపా సైన్యానికి ఉంది. ఏపీ, తెలంగాణలో సభ్యత్వ నమోదు చేపట్టాం."- చంద్రబాబు, తెదేపా అధినేత

ఇదీ చదవండి: 'ఆర్ఆర్​ఆర్​లో​ ఆ సీన్​ కోసం మూడేళ్లు కష్టపడ్డాం!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.