Chandrababu: పాలనను ప్రశ్నించిన అందరిపై కేసులు పెట్టాలనుకుంటే.. ఆంధ్రప్రదేశ్‌లోని 5 కోట్ల మందిపైనా ఈ ప్రభుత్వం కేసులు పెట్టాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. సంక్షేమంలో కోతలు, అభివృద్ది పనులపై ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలకు ప్రభుత్వం అసహనానికి లోనవుతోందని మండిపడ్డారు. చిత్తూరు జిల్లా పూతలపట్టులో ఎమ్మెల్యేను విద్యా దీవెనపై ప్రశ్నించిన ఇంజినీరింగ్ విద్యార్థి జశ్వంత్‌పై కేసు పెట్టి అరెస్టు చేయడం.. ప్రభుత్వ అసహనానికి ప్రత్యక్ష సాక్ష్యమని ఆక్షేపించారు. విద్యార్థులపై కేసులు పెట్టి వారి జీవితాలను నాశనం చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
-
వైసిపి ప్రభుత్వ పాలనపై గడపగడపలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేత వ్యక్తం అవుతుంది. కాలర్ ఎగరేసుకుని ఎమ్మెల్యేలు తిరగడం కాదు... జనం కాలర్ పట్టుకుని ప్రశ్నిస్తున్నారు. సంక్షేమంలో కోతలు, అభివృద్ది పనులపై ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలకు ప్రభుత్వం అసహనానికి లోనవుతుంది.(1/4) pic.twitter.com/tdglOChS48
— N Chandrababu Naidu (@ncbn) August 5, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">వైసిపి ప్రభుత్వ పాలనపై గడపగడపలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేత వ్యక్తం అవుతుంది. కాలర్ ఎగరేసుకుని ఎమ్మెల్యేలు తిరగడం కాదు... జనం కాలర్ పట్టుకుని ప్రశ్నిస్తున్నారు. సంక్షేమంలో కోతలు, అభివృద్ది పనులపై ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలకు ప్రభుత్వం అసహనానికి లోనవుతుంది.(1/4) pic.twitter.com/tdglOChS48
— N Chandrababu Naidu (@ncbn) August 5, 2022వైసిపి ప్రభుత్వ పాలనపై గడపగడపలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేత వ్యక్తం అవుతుంది. కాలర్ ఎగరేసుకుని ఎమ్మెల్యేలు తిరగడం కాదు... జనం కాలర్ పట్టుకుని ప్రశ్నిస్తున్నారు. సంక్షేమంలో కోతలు, అభివృద్ది పనులపై ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలకు ప్రభుత్వం అసహనానికి లోనవుతుంది.(1/4) pic.twitter.com/tdglOChS48
— N Chandrababu Naidu (@ncbn) August 5, 2022
వైకాపా ప్రభుత్వ పాలనపై 'గడప గడప'లో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోందని అన్నారు. కాలర్ ఎగరేసుకుని తిరుగుదామనుకున్న ఎమ్మెల్యేలను జనం కాలర్ పట్టుకుని ప్రశ్నిస్తున్నారని అన్నారు. వేపనపల్లి గ్రామంలో ఘటనకు వైకాపా క్షమాపణ చెప్పి... విద్యార్థిపైనా, అతనికి మద్దతుగా నిలిచిన గ్రామస్థులు, తెదేపా నేతలపై పెట్టిన కేసు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే అందరినీ విడుదల చేసి, స్థానిక పోలీసుల అత్యుత్సాహంపై డీజీపీ చర్యలు తీసుకోవాలన్నారు.
-
పాలనను ప్రశ్నించిన ప్రతి వారిపై కేసు పెట్టాలి అని ఈ ప్రభుత్వం భావిస్తే... రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మందిపైనా జగన్ కేసులు పెట్టాల్సి ఉంటుంది.(3/4)
— N Chandrababu Naidu (@ncbn) August 5, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">పాలనను ప్రశ్నించిన ప్రతి వారిపై కేసు పెట్టాలి అని ఈ ప్రభుత్వం భావిస్తే... రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మందిపైనా జగన్ కేసులు పెట్టాల్సి ఉంటుంది.(3/4)
— N Chandrababu Naidu (@ncbn) August 5, 2022పాలనను ప్రశ్నించిన ప్రతి వారిపై కేసు పెట్టాలి అని ఈ ప్రభుత్వం భావిస్తే... రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మందిపైనా జగన్ కేసులు పెట్టాల్సి ఉంటుంది.(3/4)
— N Chandrababu Naidu (@ncbn) August 5, 2022
ఇదీ జరిగింది: ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా పూతలపట్టు మండల కేంద్రంలో గురువారం ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ఎంఎస్ బాబు వేపనపల్లి గ్రామానికి వచ్చారు. ఇంజినీరింగ్ విద్యార్థి జశ్వంత్ మూడో విడత విద్యాదీవెన డబ్బులు అందలేదని చెప్పగా, కారణమేంటో చెప్పాలని ఎమ్మెల్యే వాలంటీర్‌ను ప్రశ్నించారు. కొందరికి ఇంకా ఖాతాల్లో జమ కావాల్సి ఉందని వాలంటీర్ చెప్పారు. మూడేళ్లలో గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని చెబుతుండగా, పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్‌కు తరలిస్తుండగా, గ్రామానికి చెందిన మరో 8 మంది తమ వాహనాలను అడ్డుపెట్టారు. ఎమ్మెల్యే అనుచరులు వారిపై దాడికి దిగారు. పోలీసులు వారించి, విడతల వారీగా వారిని స్టేషన్‌కు తీసుకెళ్లారు.
చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు పులివర్తి నాని, తెదేపా నాయకులు భారీగా స్టేషన్ వద్దకు చేరుకొని, యువకులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వేపనపల్లి మహిళలు జాతీయ రహదారిపై బైఠాయించారు. వైకాపా శ్రేణులు సైతం స్టేషన్ ఎదుట మోహరించాయి. ఆ పార్టీ మండల కన్వీనర్ శ్రీకాంత్‌రెడ్డి కారుపై కొందరు రాళ్ల దాడి చేయడంతో పోలీసులు లాఠీఛార్జీ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెదేపా కార్యకర్తలు నినాదాలు చేశారు. ఎస్పీ రిషాంత్‌రెడ్డి, డీఎస్పీ సుధాకర్‌రెడ్డి స్టేషన్‌కు చేరుకుని పరిస్థితిని నియంత్రించారు. ఎమ్మెల్యే బాబు, ఎంపీడీవో గౌరి ఇంజినీరింగ్ యువకుడితో పాటు మరికొందరిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, తమ కార్యకర్తపై వైకాపా శ్రేణులు దాడి చేశాయని తెదేపా నాయకులు ప్రతి ఫిర్యాదు చేశారు.