ETV Bharat / city

Chandrababu: 'మాతో పెట్టుకుంటే కాలగర్భంలో కలిసిపోతారు' - cbn news

ఏపీ ప్రభుత్వం, పోలీసుల తీరుపై తెదేపా అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి దేవినేని ఉమా అరెస్టును తప్పుబట్టారు. తప్పు జరగకుంటే.. తమ పార్టీ నిజ నిర్ధరణ బృందాన్ని ఎందుకు కొండపల్లికి వెళ్లనివ్వడం లేదని ప్రశ్నించారు. దేవినేని ఉమా కుటుంబీకులను పరామర్శించిన చంద్రబాబు.. అండగా ఉంటానని వారికి ధైర్యం చెప్పారు.

దేవినేని కుటుంబానికి చంద్రబాబు పరామర్శ
దేవినేని కుటుంబానికి చంద్రబాబు పరామర్శ
author img

By

Published : Jul 31, 2021, 1:27 PM IST

మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కుటుంబీకులను తెదేపా అధినేత చంద్రబాబు పరామర్శించారు. ఉమాపై కేసు పెట్టడం చాలా దుర్మార్గమని ఆగ్రహించారు. వైకాపా నాయకులే దాడి చేసి రివర్స్‌ కేసు పెట్టారని ఆరోపించారు. జరిగిన ఘటన మొత్తాన్ని ప్రజలంతా గమనించారన్న చంద్రబాబు.. ఎస్సీలపై దాడిచేసినట్లు దేవినేనిపై తప్పుడు కేసులు పెట్టారని అన్నారు. కొండపల్లి బొమ్మలు తయారుచేసే చెట్లను కొట్టేస్తున్నారని.. అక్రమ మైనింగ్‌ జరుగుతోందని చెప్పినా పట్టించుకోలేదని ప్రభుత్వం, అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అక్రమ మైనింగ్‌ జరుగుతున్న ప్రాంతానికి వెళ్తామంటే నిర్బంధిస్తారా? అని ప్రశ్నించారు.

దేవినేని కుటుంబానికి చంద్రబాబు పరామర్శ
మాతో పెట్టుకుంటే కాలగర్భంలో కలిసిపోతారు

"అక్రమ మైనింగ్‌ జరగకపోతే తెదేపా నేతలను ఎందుకు అడ్డుకుంటున్నారు? ఏపీలో రౌడీ, గూండాలు, నేరస్థుల రాజ్యముందా? పరిపాలన చేతగాక... అక్రమ కేసులే పనిగా పెట్టుకున్నారు. పోలీసులు ఇంత నీచంగా ఎప్పుడూ పని చేయలేదు. అక్రమ మైనింగ్ జరుగుతోందని ఫిర్యాదు చేస్తే ఎందుకు పోనివ్వరు? అక్రమ మైనింగ్ జరగకపోతే నిజనిర్ధరణ కమిటీని ఎందుకు అడ్డుకుంటున్నారు? పోలీసులు దారిమళ్లించి.. దాడి జరిగే ప్రాంతం వైపు ఉమను వెళ్లేలా చేశారు. దాడులకు తెదేపా భయపడదు. తెదేపాతో పెట్టుకున్నవాళ్లు కాలగర్భంలో కలిసిపోయారు" - చంద్రబాబు, తెదేపా అధినేత

కోడెల శివరాం గృహ నిర్బంధం..

దేవినేని కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తుండగా..నరసరావుపేటలో తెదేపా నేత కోడెల శివరాంను పోలీసులు గృహనిర్బంధం చేశారు. నరసరావుపేటలోని తన నివాసం నుంచి బయలుదేరుతుండగా పోలీసులు అడ్డుకున్నారు.

ఇవీ చూడండి :

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.