ETV Bharat / city

ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ ఈ నెల 14న నిరసన దీక్ష - telangana news

భద్రాచలం అభివృద్ధిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల హామీల నిర్లక్ష్యంపై ఈనెల 14వ తేదీన నిరసన దీక్ష చేపట్టనున్నట్లు యువ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణారెడ్డి తెలిపారు. దీక్షకు సంబంధించిన 'ఛలో ఖమ్మం' గోడ పత్రికను హైదరాబాద్​లో ఆవిష్కరించారు.

Challo Khammam Poster Released by yuva telangana party president balakrishna reddy in somajiguda
ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ ఈ నెల 14న నిరసన దీక్ష
author img

By

Published : Feb 9, 2021, 5:07 PM IST

భద్రాచల రామాలయ అభివృద్ధి విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని యువ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణారెడ్డి ఆరోపించారు. ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ.. ఈ నెల 14న నిరసన దీక్ష చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు. నిరసన దీక్ష 'ఛలో ఖమ్మం' గోడ పత్రికను హైదరాబాద్‌ సోమాజిగూడలో ఆవిష్కరించారు. ఖమ్మం ధర్నాచౌక్‌లో నిర్వహించే దీక్ష అనంతరం తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.

రాష్ట్ర విభజన అనంతరం భద్రాచలం అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి నిత్యం జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేసే భాజాపా.. రామాలయాన్ని పట్టించుకోవడం లేదన్నారు. భద్రాచలాన్ని రూ.150 కోట్లతో అభివృద్ధి చేస్తామని చెప్పిన సీఎం కేసీఆర్‌.. ఇప్పటి వరకు నిధులు ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు.

ఇదీ చూడండి: నర్సిరెడ్డి కుటుంబానికి శాంతా బయోటెక్ అధినేత సాయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.