ETV Bharat / city

Central Vigilance Commission: 'ఇష్టారాజ్యంగా కాంట్రాక్టులు ఇవ్వడం చెల్లదు'

నామినేషన్లపై ఇష్టారాజ్యంగా పనులు అప్పగించడం, కాంట్రాక్టులు ఇవ్వడం చెల్లదని కేంద్ర విజిలెన్స్ కమిషన్ స్పష్టం చేసింది. తప్పనిసరి లేదా అత్యవసరమైన సందర్భాల్లోనే నామినేషన్‌పై పనులు అప్పగించాలని ఆదేశించింది. ప్రాజెక్టులు, పనులు, సరకుల సరఫరా వంటి వాటికి టెండర్ విధానం అనుసరించకుండా.. పోటీలేకుండా నామినేషన్ విధానంలో ప్రభుత్వ విభాగాలు, సంస్థలు అప్పగించడం సరైన చర్యకాదని పేర్కొంది.

Central Vigilance Commission
Central Vigilance Commission
author img

By

Published : Aug 11, 2021, 5:05 AM IST

నామినేషన్ విధానంలో పనులు అప్పగించడం అందరికీ సమాన అవకాశాలు అనే హక్కును తిరస్కరించడమే అవుతుందని కేంద్ర విజిలిన్స్‌ కమిషన్‌(CVC) స్పష్టం చేసింది. టెండర్ల ద్వారా పనులు అప్పగించడం సరైన విధానమని వివరించింది. కొన్ని తప్పనిసరి పరిస్థితులు, అత్యవసరమైన సందర్భాల్లో మాత్రమే నామినేషన్‌పై పనులు అప్పగించవచ్చంది. నామినేషన్ పనులకు సంబంధించి వివిధ మార్గదర్శకాలు సూచించింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విభాగాలకు కేంద్ర విజిలెన్స్ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది.

అలాంటప్పుడే నామినేషన్​పై పనులు..

నామినేషన్‌పై ఇచ్చిన పనులు, చేసిన కొనుగోళ్లు, కన్సల్టెన్సీ కాంట్రాక్ట్ సంబంధిత శాఖలు, సంస్థలు, విభాగాలు ప్రతి మూడు నెలలకు ఒకసారి పనుల వివరాలను నిర్దేశించిన వ్యవస్థలకు తెలియజేయాల్సి ఉంటుంది. ఈ వివరాలను సంబంధిత శాఖల కార్యదర్శులకు అందజేయాలి. ప్రభుత్వరంగ సంస్థలు, బ్యాంకులు, బీమా కంపెనీలు బోర్డు ఆఫ్ డైరెక్టర్లు లేదా సమాన స్థాయి ఉన్న మేనేజింగ్ వ్యవస్థలకు తెలియజేయాల్సి ఉంటుంది. సంబంధిత సంస్థలకు చెందిన ఆడిట్ విభాగాలు నామినేషన్‌పై కేటాయించిన వాటిలో కనీసం పదిశాతం కేసులను ప్రత్యేకంగా పరిశీలించాలి. నామినేషన్ అప్పగించడానికి గల కారణాల సైతం వైబ్‌సైట్లలో స్పష్టంగా వివరించాలని పేర్కొంది. ప్రకృతి వైపరీత్యాలు, ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించినప్పుడు నామినేషన్‌పై పనులు అప్పగించవచ్చని తెలిపింది.

ఆదేశాలు జారీ..

ఒక సంస్థ నుంచే వస్తువులు సమీకరించే పరిస్థితి ఉన్నపుడు... వస్తువుల సరఫరాదారు ఒకరే అయినప్పుడు, ప్రత్యామ్నాయం లేనప్పుడు, చాలాసార్లు వేలం వేసినా, టెండర్లు పిలిచినా ఎవరు పాల్గొననప్పుడు వంటి పరిస్థితుల్లో మాత్రమే నామినేషన్‌పై ఇవ్వడానికి అవకాశం ఉంటుందని పేర్కొంది. సీవీసీ ఉత్తర్వులు తప్పనిసరిగా అమలు చేయాలని రాష్ట్రంలోని పురపాలక కమిషనర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి.

ఇవీచూడండి: Palamuru -Rangareddy: ప్రశాంతంగా ప్రజాభిప్రాయ సేకరణ.. ప్రాజెక్టును స్వాగతించిన రైతులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.