సీఏఏ, ఎన్‌ఆర్‌సీ ఏ ఒక్క భారతీయుడికి వ్యతిరేకంగా లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఎన్ని నిరసనలు చేసినా, ఎంత రెచ్చగొట్టినా సీఏఏను అమలు చేసి తీరుతామని పేర్కొన్నారు. స్వదేశీ శక్తులు, విదేశీ శక్తులు కలిసి మోదీ ప్రభుత్వంపై కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. సీఏఏ, ఎన్‌ఆర్‌సీపై అవగాహన కల్పించేందుకు హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద భాజపా ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ఎన్‌ఆర్‌సీ, సీఏఏపై అవగాహన అవసరం: లక్ష్మణ్