యురేనియం అన్వేషణ, మైనింగ్, అణు విద్యుత్ కేంద్రాలకు అనుమతిచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనని కిషన్‌రెడ్డి తెలిపారు. దిల్లీలో ఆయన మాట్లాడుతూ అధికారంలో ఉన్నప్పుడు ఒకమాట, ప్రతిపక్షంలో మరోమాట మాట్లాడటం కాంగ్రెస్‌కే చెల్లిందన్నారు. 2009లోనే కాంగ్రెస్ ప్రభుత్వం యురేనియం అన్వేషణకు అనుమతులు ఇవ్వాగా.. 2016లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో యురేనియం తవ్వకాలకు పచ్చజెండా ఊపారని పేర్కొన్నారు.
ప్రజలను భయపెట్టొద్దు..
ఒక్క తెలంగాణలోనే కాక అన్ని రాష్ట్రాల్లోనూ ఖనిజాలపై అన్వేషణ జరుగుతోందన్నారు. గ్యాస్, బొగ్గు, యురేనియం, గ్రానైట్, సీసం, బంగారం తదితర ఖనిజాల డేటాబేస్ తయారుచేస్తునట్లు తెలిపారు. చెట్లు, అటవీ, వన్య, భూగర్భ జలాలు, పర్యావరణానికి నష్టంలేకుండా అన్వేషణకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. ప్రజలను భయాందోళనకు గురిచేసే ప్రయత్నాలు మంచివికాదని హితవు పలికారు. ప్రజాభిప్రాయం, పర్యావరణం, అటవీ ప్రాంతం పరిశీలించాకే కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. నేటి వరకు యురేనియం తవ్వకాలపై కేంద్రం అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: యురేనియం తవ్వకాలకు అనుమతివ్వం: సీఎం కేసీఆర్