కరోనా వంటి ఆపత్కాలంలో ముందుండి పోరాడిన ప్రతి ఒక్కరికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. వైరస్ అంతమయ్యే వరకు ప్రతి ఒక్కరు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 మరోసారి విజృంభిస్తోందని చెప్పారు. వ్యాక్సిన్ వచ్చే వరకు అప్రమత్తంగా ఉండాలన్నారు.

హైదరాబాద్ అంబర్పేట్లోని మున్సిపల్ గ్రౌండ్లో అరుణ్ ప్రజాసేవా సమితి ఆధ్వర్యంలో కరోనా యోధులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సన్మానించారు. కష్టకాలంలో సేవలందించినందుకు వారిని అభినందించారు.