విభజన హామీల పూర్తికి పదేళ్ల సమయం ఉందని కేంద్ర హోంశాఖ తెలిపింది. లోక్‌సభలో ఏపీకి చెందిన ఎంపీ రామ్మోహన్‌నాయుడు విభజన చట్టం అమలుపై శ్వేతపత్రం విడుదల చేయాలని అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ జవాబిచ్చారు. ఇప్పటికే అనేక అంశాలు అమల్లో ఉన్నాయన్న కేంద్ర హోంశాఖ.. మరికొన్ని విభజన హామీలు వివిధ దశల్లో ఉన్నాయని వెల్లడించింది.
ప్రాజెక్టులు, విద్యాసంస్థల నిర్మాణం సుదీర్ఘకాలం పట్టే అంశాలు ఉన్నాయని తెలిపింది. విభజన హామీల అమలుకు వివిధ శాఖలతో సమీక్ష నిర్వహిస్తున్నామన్న కేంద్రం.. విభజన చట్టం అమలు పురోగతిని హోంశాఖ సమీక్షిస్తోందని తెలిపింది. ఇరు రాష్ట్రాల అధికారులతో 24 సమీక్ష సమావేశాలు జరిగాయని కేంద్రం వివరించింది.
ఇవీచూడండి: కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు ఎప్పుడు?: నామ