ETV Bharat / city

ఈ ఆర్థిక సంవత్సరంలో మరింత అప్పు కోసం ఏపీ అభ్యర్థన: కేంద్రం - telangana news

ఈ ఆర్థిక సంవత్సరంలో మరింత అప్పు చేసేందుకు ఏపీ అభ్యర్థించిందని పార్లమెంట్​లో కేంద్రం వెల్లడించింది. మరో రూ.27 వేల కోట్లు అప్పు చేసేందుకు అనుమతి కోరిందని తెలిపింది. ఈ మేరకు గత నెల దిల్లీ పర్యటనలో ఏపీ సీఎం జగన్‌ కోరారని పేర్కొంది.

ap debts, central government about ap debts
ఈ ఆర్థిక సంవత్సరంలో మరింత అప్పు కోసం ఏపీ అభ్యర్థన: కేంద్రం
author img

By

Published : Feb 8, 2022, 7:56 PM IST

ఈ ఆర్థిక సంవత్సరంలో మరింత అప్పు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ అభ్యర్థించిందని పార్లమెంట్​లో కేంద్రం వెల్లడించింది. మరో రూ.27 వేల కోట్లు అప్పు చేసేందుకు అనుమతి కోరిందని పేర్కొంది. బహిరంగ మార్కెట్‌లో అప్పు చేసేందుకు ఆ రాష్ట్ర సీఎం విజ్ఞప్తి చేశారని.. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి వెల్లడించారు. ఈ మేరకు గత నెల దిల్లీ పర్యటనలో ఏపీ సీఎం జగన్‌ కోరారని చెప్పారు. 2021-22లో ఉన్న పరిమితిని రూ.42,472 కోట్లకు పెంచాలని అభ్యర్థించారని తెలిపారు. తెదేపా ఎంపీ కనకమేడల ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి రాజ్యసభలో బదులిచ్చారు.

సెక్యూరిటీ బాండ్ల వేలం..

ఆర్‌బీఐ ద్వారా మరోసారి సెక్యూరిటీ బాండ్లను ఏపీ ప్రభుత్వం వేలం వేసింది. సెక్యూరిటీ బాండ్ల ద్వారా రూ.2 వేల కోట్లు రుణం పొందింది. 7.37 శాతం మేర వడ్డీకి సెక్యూరిటీ బాండ్లు వేలం వేసింది. 16 ఏళ్ల కాలపరిమితితో వెయ్యి కోట్లు, 20 ఏళ్ల పరిమితితో మరో వెయ్యి కోట్ల రుణం తీసుకుంది.

ఇదీ చదవండి : Amit shah Muchintal Visit : సమతామూర్తి కేంద్రంలో కేంద్రమంత్రి అమిత్‌ షా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.