ETV Bharat / city

మన భూములకు పోషకాలు తక్కువంటా.. అందుకే మరిన్ని ఎరువులంటా! - తెలంగాణలో కొత్త ఎరువులు

తెలుగు రాష్ట్రాల్లోని నేలల్లో పోషకాలు తక్కువగా ఉన్నందుకేన్నాయంటా. అందుకే మరిన్ని ఎరువులు వేయడానికి అనుగుణంగా కొత్త కాంప్లెక్సు ఎరువుల తయారీకి కేంద్ర వ్యవసాయ శాఖ అనుమతించింది. ఈమేరకు ఎరువుల నియంత్రణ ఉత్తర్వుకు సవరణలు చేస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇకమై మిశ్రమ ఎరువులను రాష్ట్రంలో తయారు చేయనున్నారు.

Fertilizer Control Order
Fertilizer Control Order
author img

By

Published : Jun 28, 2020, 1:57 PM IST

తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని మిశ్రమ ఎరువుల తయారీ, అమ్మకాలకు కేంద్ర వ్యవసాయశాఖ అనుమతించింది. తెలంగాణ, ఏపీలలోని వ్యవసాయ భూముల్లో పలు పోషకాలు తక్కువగా ఉన్నాయని పేర్కొంటూ.. ఇక్కడి పైర్లకు అవసరమయ్యే ఐదారు రసాయనాలతో ఎరువుల తయారీకి అనుమతులు మంజూరు చేసింది. ఈమేరకు ఎరువుల నియంత్రణ ఉత్తర్వుకు సవరణలు చేస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే జాతీయ సగటుకన్నా మించి ఎక్కువగా రసాయన ఎరువులు వాడుతున్నారు. ఈ నేపథ్యంలో మరిన్ని రసాయనాలను కలిపి తయారుచేసే మిశ్రమ ఎరువులకు కేంద్రం అనుమతించడం గమనార్హం.

పంటల సాగు ప్రారంభ సమయంలో ‘డై అమ్మోనియం ఫాస్ఫేట్‌’(డీఏపీ) ఎరువును దుక్కిలో వేయడం ఆనవాయితీ. ఇకనుంచి ఈ ఎరువులో గంధకం కలిపి తయారు చేసేందుకు అనుమతించారు.

  • ఏపీలోని చిత్తూరు జిల్లా కోసం 9-16-12-05-01 పేరు గల కాంప్లెక్స్‌ ఎరువు వాడకానికి అనుమతి ఉంది. ఇకనుంచి దీనిని విశాఖపట్టణం, విజయనగరం భూముల్లో మాత్రమే వాడటానికి కేంద్రం అనుమతించింది. ఇందులో నత్రజని 9 శాతం, భాస్వరం 16, పొటాష్‌ 12, గంధకం 5, ఒక శాతం జింక్‌ ఉండాలని సూచించింది.
  • కొత్తగా ఫాస్పోజిప్సం’ పేరుతో గుళికల రూపంలో ఎరువును మూడేళ్లపాటు తయారు చేసేందుకు అనుమతించింది. ఇందులో గంధకం 13 శాతం, కాల్షియం సల్ఫేట్‌ 70, ఫ్లోరైడ్‌ ఒక శాతం పొడి రూపంలో ఉండాలి. ఘనరూపంలో ప్రతి కిలో ఎరువులో లెడ్‌ 100 మిల్లీగ్రాముల(మి.గ్రా) కాడ్మియం 5, క్రోమియం 50, నికెల్‌ 50, ఆర్సెనిక్‌ 10, మెర్క్యురీ 0.15 మి.గ్రా. చొప్పున ఉండాలి.
  • 8:21:21 పేరుతో ప్రస్తుతం రైతులకు అమ్ముతున్న కాంప్లెక్స్‌ ఎరువులో ఇక నుంచి మెగ్నీషీయం 1.20 శాతం, గంధకం 2, జింక్‌ 1, బోరాన్‌ 0.2 నుంచి 0.3 శాతం చొప్పున కలిపి తయారు చేయవచ్చు.
  • 12:24:0:0:0.5:0.2 పేరుతో మరో కొత్త కాంప్లెక్స్‌ ఎరువును ఏపీలోని చిత్తూరు మినహా మిగిలిన జిల్లాల్లో, తెలంగాణలో పత్తి సాగు సమయంలో వాడవచ్చు. ఈ ఎరువులో నత్రజని 12, భాస్వరం 24, జింక్‌ 0.5, బోరాన్‌ 0.2 శాతం ఉండాలి.
  • యూరియా వాడకాన్ని నియంత్రించడానికి 24-0-16 పేరుతో నత్రజని, పొటాష్‌ల మిశ్రమ ఎరువును తయారుచేసి ఏపీలో చిత్తూరు మినహా ఇతర జిల్లాల్లో తెలంగాణ అంతటా పత్తి సాగుకు వాడవచ్చు.
  • ఇకనుంచి ద్రవరూప ఎరువు మనదేశంలో తయారుచేసినా, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్నా అందులో ఏమేం రసాయనాలున్నాయనే వివరాలన్నీ ప్యాక్‌పై ముద్రించాలి.
  • రైతులు తమ పొలాల్లో మట్టి నమూనాలను తీసుకెళ్లి ప్రయోగశాలల్లో పరీక్షించాక.. అందులో ఏయే పోషకాలు తక్కువున్నాయనేది తెలుసుకున్నాకనే మిశ్రమ ఎరువులు వాడాలి. లేకపోతే ఆర్థికంగానే కాకుండా, భూముల్లో రసాయనాలు పెరిగి భూసారం దెబ్బతింటుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

ఇదీ చదవండి: కరోనా విలయ తాండవం.. రాష్ట్రంలో 13వేలు దాటిన కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.