ETV Bharat / city

మూలకుపడిన నిఘానేత్రాలు... అటకెక్కిన ఎంజీబీఎస్​ భద్రత - ఎంజీబీఎస్​ బస్టాండ్​ వార్తలు

'దయచేసి గమనించండి... ఇక్కడ సీసీటీవీ కెమెరాలు పని చేయడం లేదు. మీ వస్తువులకు మీరే బాధ్యులు' అని నేరుగా చెప్పకుండా.. ఎక్కడికక్కడ 'దొంగలున్నారు జాగ్రత్త' అనే బోర్డులు పెడుతున్నారు. ఇది ఎక్కడో కాదు. ఆసియాలోనే అతి పెద్ద బస్​స్టేషన్​గా చరిత్రకెక్కిన ఎంజీబీఎస్​లోనే. బస్​స్టేషన్లో భద్రతను ఆర్టీసీ యాజమాన్యం గాలికి వదిలేయడం వల్ల.. ప్రయాణికుల వస్తువులకు భద్రత కరవైంది.

మూలకుపడిన నిఘానేత్రాలు... అటకెక్కిన ఎంజీబీఎస్​ భద్రత

author img

By

Published : Nov 1, 2020, 11:42 AM IST

ఆర్టీసీకి చెందిన 45 మంది సొంత భద్రతా సిబ్బంది... 24 గంటలూ పెట్రోలింగ్... అఫ్టల్​గంజ్ పోలీసు సిబ్బంది... ఎంజీబీస్ నిర్వాహక సిబ్బంది.. తనిఖీ సిబ్బంది... ఇలా వందల్లో విధులు నిర్వహిస్తూ ఉంటారు. 127 సీసీటీవీ కెమెరాలతో కమాండ్ కంట్రోల్ సెంటర్... దీంతో పాటు అప్జల్​గంజ్ పోలీస్​స్టేషన్​ ఔట్ పోస్టు కూడా ఎంజీబీఎస్​లోనే కొనసాగుతోంది.

మూలకుపడిన నిఘానేత్రాలు... అటకెక్కిన ఎంజీబీఎస్​ భద్రత
మూలకుపడిన నిఘానేత్రాలు... అటకెక్కిన ఎంజీబీఎస్​ భద్రత

ఇంత పటిష్ఠమైన భద్రత ఉంటే ఇంకా తిరుగేముందని ప్రయాణికులు అనుకునేవారు. తమ వస్తువులు పక్కన పెట్టి మాటల్లో పడిపోయేవారు. లేదా సెల్ ఫోన్​ సంభాషణలో మునిగిపోయేవారు. ఇందంతా ఒకప్పటి మాట. ప్రస్తుతం మీరు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా... మీ వస్తువులు మాయం అవుతాయి. ఇందుకు అక్కడ ప్రతి చోట కనిపించే హెచ్చరిక బోర్డులే నిదర్శనం. “ దొంగలున్నారు జాగ్రత్త .. మీ వస్తువులకు మీరు జాగ్రత్త వహించండి. బస్సులో మీ విలువైన వస్తువులు పెట్టి బయటకు వెళ్లకండి. ఎంజీబీఎస్ ప్రాంగణంలో కూడా మీ వస్తువులను భద్రంగా ఉంచుకోండి.. మీ వస్తువుల భద్రత మీదే " అనే హెచ్చరికలు కనిపిస్తున్నాయి. ప్రాంగణం బయట కూడా మీ వాహనాల భద్రతకు బాధ్యులు అనే హెచ్చరికల బోర్డులు ఎక్కడికక్కడ కనిపిస్తాయి.

దీనంతటికీ కారణం .. అక్కడ సీసీటీవీ కెమెరాలు పనిచేయకపోవడమే. లాక్​డౌన్ కాలంలో వాటితో పని ఏముంది అనుకున్నారో ఏమో మరి. మొత్తం 127 సీసీటీవీ కెమెరాల్లో ఒక 5 కెమెరాలు మాత్రమే పని చేస్తున్నాయి. ఇలా 5 సీసీటీవీ కెమెరాలే పని చేయడం వల్ల కమాండ్ కంట్రోల్ సెంటర్​ తో పనిలేకుండా పోయింది. ఆ గది ముందు ఎంజీబీఎస్ చీఫ్ సెక్యూరిటీ ఇన్​స్పెక్టర్.. మరో ఇద్దరు ముగ్గురు సహాయకులు అక్కడే ఉండి విధులు నిర్వహిస్తుంటారు. మిగతా భద్రతా సిబ్బంది ప్రాంగణమంతా పర్యవేక్షిస్తుంటారు.

సీసీటీవీ కెమెరాలు పని చేయటం లేదని అక్కడ పని చేస్తున్న సిబ్బందితో పాటు... అప్జల్​గంజ్ పోలీసులు కూడా ఆర్టీసీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే వాటిని ఏర్పాటు చేయాలని... పండుగల కాలం వస్తోంది కనుక ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని వారికి తెలిపారు. ఆర్టీసీ ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు.

ఇదీ చూడండి: నువ్వు చెప్పినట్టే పంట వేస్తే ఏం మిగిలింది కేసీఆర్​ సారూ..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.