ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు(CBN Letter To SEC) ఆరోపించారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్(CBN Letter To SEC)కు లేఖ రాశారు. 14వ వార్డు తెదేపా ఎస్సీ అభ్యర్థి వెంకటేశ్‌పై వైకాపా నేతలు దాడిచేశారని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. నామినేషన్ దాఖలుకు ఆర్వో కార్యాలయానికి వెళ్లగా.. అక్కడే తమ పార్టీ అభ్యర్థిపై దాడి జరిగిందని చెప్పారు. దాదాపు 30 మంది వెంకటేశ్‌పై దాడికి దిగి, నామపత్రాలు చించివేశారని లేఖ(CBN Letter To SEC)లో తెలిపారు.
దాడిలో వెంకటేశ్ తీవ్రంగా గాయపడ్డారన్న చంద్రబాబు.. అందుకు సంబంధించిన ఫొటోలను లేఖకు జతచేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు ముప్పు పొంచి ఉన్న అభ్యర్థులకు భద్రత కల్పించాలని చంద్రబాబు(CBN Letter To SEC) డిమాండ్ చేశారు. దాడిచేసిన వారిపై చర్యలకు ఆదేశించి.. తెదేపా అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్ వేసేలా చూడాలని చంద్రబాబు కోరారు.
ఇదీ చదవండి: ధాన్యం కుప్పపైనే ప్రాణాలొదిలిన రైతు.. కొనుగోలులో జాప్యమే కారణమా..?