ETV Bharat / city

ఏపీ సర్కారు ప్రజల ప్రాణాలను పణంగా పెడుతోంది: చంద్రబాబు

ఏపీలో 18ఏళ్ల పైబడిన వారికి వ్యాక్సినేషన్‌ సాధ్యం కాదని ప్రభుత్వం చెప్పడం దారుణమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. కరోనా టీకా కోసం నిధులు వెచ్చించకుండా ప్రజల ప్రాణాలను సర్కారు పణంగా పెడుతోందని మండిపడ్డారు. కొవిడ్‌ వారియర్స్‌తో ఆన్‌లైన్ సమావేశం నిర్వహించిన ఆయన.... ప్రస్తుత పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. రెండో దశను ఎదుర్కోవటంతో పాటు... మూడోదశ రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు అభిప్రాయపడ్డారు.

CBN Corona Awareness Meeting
కరోనాపై చంద్రబాబు మీటింగ్
author img

By

Published : May 8, 2021, 7:35 AM IST

ఆంధ్రప్రదేేశ్‌లో కరోనా విస్తరిస్తోన్న క్రమంలో సమాజ శ్రేయస్సుకు అవసరమైన సమాచారం పేరిట ఆన్‌లైన్‌లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఈ సదస్సులో ఆరోగ్య సంరక్షణ, ఫార్మా రంగాల నిపుణులు పాల్గొన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో కలిసికట్టుగా కరోనాను ఎలా ఎదుర్కోవాలో అంతా ఆలోచన చేయాలని ఆయన సూచించారు. మహమ్మారిపై పోరాటంలో సమష్టి కృషి అవసరమన్నారు. 20ఏళ్లు పైబడిన వారిపై రెండో దశ తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. మూడో దశలో చిన్నారులపైనా తీవ్ర ప్రభావం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నందున అప్రమత్తత అవసరమని అభిప్రాయపడ్డారు. ముందుగానే సమగ్ర ప్రణాళికలు చేపడితే భవిష్యత్తు ప్రమాదాలను నివారించగలమని తెలిపారు.

ఈ సమావేశంలో వైద్య నిపుణులు..పలు సూచనలు చేశారు. 18 ఏళ్లు దాటిన వారందరికీ వ్యాక్సినేషన్‌ పూర్తయితే ... వారంతా ప్రమాదపు అంచు నుంచి బయటపడతారని చెప్పారు. చాలా మంది కొవిడ్‌ లక్షణాలు కనిపించిన మొదటి రోజే హెచ్‌ఆర్‌సీటీ స్కాన్‌ చేయించుకుంటున్నారని...దీని వల్ల వారి ఊపిరితిత్తుల్లో ఎలాంటి లక్షణాలు కనిపించవని వెల్లడించారు. వైరస్‌ లేదనుకుని చాలా మంది అశ్రద్ధ చేస్తున్నారని... ఇది విషమపరిస్థితికి దారితీస్తోందని అభిప్రాయపడ్డారు.

కరోనా ప్రతి ఒక్కరి మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తోందని మానసిక వైద్య నిపుణులు తెలిపారు. కొవిడ్‌ రోగులను పలకరించేందుకు డిజిటల్‌ విజిటింగ్‌ హవర్స్‌ వ్యవస్థ ప్రవేశపెట్టాలని... స్నేహితులు, కుటుంబసభ్యులతో మాట్లాడిస్తే మానసిక ఒత్తిడి తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. భయాలు తొలగించే దిశగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని సూచించారు. రెండోదశలో వైరస్‌ వేగంగా వ్యాపిస్తోందని...కుటుంబమంతటికీ తక్కువ సమయంలోనే సోకుంతోందని వైద్యులు తెలిపారు. ఆక్సిజన్‌ శాతం పడిపోయినంత మాత్రాన ప్రతి ఒక్క కొవిడ్‌ రోగికి ఐసీయూ అక్కర్లేదని క్రిటికల్‌ కేర్‌ స్పెషలిస్ట్‌ ధరణేంద్ర పేర్కొన్నారు. లక్షణాలు తెలియకుండా కరోనా రెండో దశ సునామీలా విరుచుకుపడుతుందని వివరించారు.

ఇదీచదవండి: మే, జూన్ నెలల్లో ఒక్కొక్కరికి ఐదు కిలోల బియ్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.