ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో భాగంగా.. డిశ్ఛార్జి పిటిషన్‌లో కౌంటరుకు సీబీఐ గడువు కోరింది. లేపాక్షి నాలెడ్జ్ హబ్, ఇందూ-గృహ నిర్మాణ మండలికి చెందిన కేసుల్లో ప్రధాన నిందితులైన ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి తదితరులు డిశ్ఛార్జి పిటిషన్(Jagan discharge petition)లు దాఖలు చేశారు. వీటిపై కౌంటరు దాఖలు చేయడానికి మరికొంత గడువు కావాలని సీబీఐ.. బుధవారం సీబీఐ కోర్టుకు విజ్ఞప్తి చేసింది.
విచారణ వాయిదా
లేపాక్షి నాలెడ్జ్ హబ్ కేసులో జగన్, విజయసాయిరెడ్డితోపాటు లేపాక్షి ఎండీ శ్రీనివాస బాలాజీ, ఐఏఎస్ అధికారి బి.పి.ఆచార్యలు డిశ్ఛార్జి పిటిషన్(Jagan discharge petition)లు దాఖలు చేశారు. దీనికి అనుమతించిన సీబీఐ కోర్టు(Jagan discharge petition) విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. దీంతో పాటు ఇందూ- గృహనిర్మాణ మండలి కేసులోనూ కౌంటరుకు గడువు ఇస్తూ 27కి వాయిదా వేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నమోదు చేసిన రాంకీ కేసును 27కి, ఇండియా సిమెంట్స్ కేసును 28కి వాయిదా వేసింది. ఈడీ తరఫున ఎవరూ హాజరుకాకపోవడంతో జగన్ తదితరుల డిశ్ఛార్జి పిటిషన్లలో కౌంటర్ల నిమిత్తం విచారణను వాయిదా వేసింది.
శ్రీలక్ష్మి పిటిషన్‌పై వాయిదాకు నిరాకరణ
ఓబుళాపురం మైనింగ్ కేసులో ఆరో నిందితురాలిగా ఉన్న ఏపీ ఐఏఎస్ అధికారిణి వై.శ్రీలక్ష్మి దాఖలు చేసిన డిశ్ఛార్జి పిటిషన్(Jagan discharge petition)పై విచారణను వాయిదా వేయాలన్న అభ్యర్థనను సీబీఐ కోర్టు తోసిపుచ్చింది. సరిహద్దు వివాదం తేలేదాకా విచారణను నిలిపివేయాలన్న పిటిషన్‌ను కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీం కోర్టును ఆశ్రయించినట్లు శ్రీలక్ష్మి తరఫు న్యాయవాది తెలిపారు. సెలవుల కారణంగా విచారణకు రావడంలో జాప్యం జరిగిందని, సుప్రీంలో విచారణ పూర్తయ్యేదాకా వాయిదా వేయాలని కోరగా సీబీఐ కోర్టు నిరాకరించడంతో న్యాయవాది పాక్షికంగా వాదనలు వినిపించారు. తదుపరి వాదనల నిమిత్తం గురువారానికి వాయిదా వేసింది.
ఇదీ చదవండి: TTD: ఆ వ్యాజ్యాలపై తితిదే కౌంటర్ వేసేందుకు నాలుగు వారాల గడువు