ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వివేకా హత్య కేసులో నాలుగో రోజు సీబీఐ విచారణ కోనసాగుతోంది. కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో సీబీఐ అధికారులు... అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి, కంప్యూటర్ ఆపరేటర్ హిదయతుల్లా, వైకాపా కార్యకర్త కిరణ్‌కుమార్ యాదవ్ విచారణకు హాజరయ్యారు. దస్తగిరి వరుసగా నాలుగు రోజులు, హిదయతుల్లా మూడు రోజులుగా, కిరణ్‌కుమార్ యాదవ్ రెండు రోజుల నుంచి విచారణకు హాజరవుతున్నారు.
ఇదీ చదవండి: Chest hospital: '1000 పడకలతో నోడల్ ఆస్పత్రిగా తీర్చిదిద్దుతాం'