CBI notices toAmanchi: ప్రకాశం జిల్లాకు చెందిన వైకాపా నేత, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు మరోసారి కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) నోటీసులు జారీ చేసింది. న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యల కేసులో విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది. సీఆర్‌పీసీ సెక్షన్ 41(ఎ) కింద అధికారులు నోటీసులు ఇచ్చారు. విజయవాడ సీబీఐ క్యాంపు కార్యాలయంలో రేపు ఉదయం 10.30 గంటలకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
ఇదే అంశంపై గతంలోనూ ఆమంచి విశాఖలో సీబీఐ ఎదుట హాజరయ్యారు. న్యాయ వ్యవస్థను కించపరిచేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన విషయమై హైకోర్టు ఆదేశాలతో గత ఏడాది నవంబరులో కేసు నమోదు చేసినట్లు ఆ నోటీసులో సీబీఐ పేర్కొన్న విషయం తెలిసిందే.