ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో.. 74వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. వైకాపా రాష్ట్ర కార్యదర్శి, ఎంపీ అవినాష్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి.. కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో సీబీఐ విచారణకు హాజరయ్యారు. వివేకా హత్య కేసులో శివశంకర్ రెడ్డి కీలక అనుమానితుడిగా ఉన్నారు.
ఐదు రోజుల క్రితమూ శివశంకర్‌రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. సునీల్ యాదవ్ బంధువు భరత్ కుమార్.. ఇవాళ కూడా విచారణకు హాజరయ్యారు. మెకానిక్ మహ్మద్ బాషాను అధికారులు విచారిస్తున్నారు.
ఇదీ చదవండి: రూ.3,316 కోట్ల మోసం.. పృథ్వీ ఇన్ఫర్మేషన్ సొల్యూషన్స్ ఎండీ అరెస్టు