ETV Bharat / city

ఇళ్లూ... కార్లూ... ఏవీ వదలకుండా..!

ఆంధ్రప్రదేశ్​కు చెందిన మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు నివాసంలో సీబీఐ సోదాలు జరుగుతున్నాయి. ట్రాన్స్​ట్రాయ్ కంపెనీ కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్న సీబీఐ అధికారులు... అందులో భాగస్వామిగా ఉన్న రాయపాటి నివాసంలోనూ తనిఖీలు చేపట్టారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం యూనియన్ బ్యాంక్ నుంచి ట్రాన్స్​ట్రాయ్ కంపెనీ రూ.500 కోట్ల రుణం తీసుకుంది. ఆ రుణం చెల్లించకపోవటంతో బ్యాంకు అధికారులు సీబీఐకి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుతో హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, దిల్లీలోని ట్రాన్స్​ట్రాయ్ కార్యాలయాల్లో సీబీఐ సోదాలు చేపట్టింది.

author img

By

Published : Dec 31, 2019, 9:42 PM IST

cbi-investigation-in-rayapati-house
రాయపాటి సాంబశివరావు నివాసంలో సీబీఐ సోదాలు

ట్రాన్స్​ట్రాయ్​ కంపెనీ యజమానులతో పాటు... భాగస్వామిగా ఉన్న రాయపాటి ఇంట్లోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇవాళ ఉదయం 5.30 గంటల సమయంలో 10మంది సీబీఐ అధికారుల బృందం... ఆంధ్రప్రదేశ్​ గుంటూరు చంద్రమౌళినగర్లోని రాయపాటి ఇంటికి వచ్చింది. సీబీఐ అధికారులు వచ్చిన సమయంలో రాయపాటి సాంబశివరావు ఇంట్లో లేరు.

ఆయన కుమారుడు రంగబాబుతో మాట్లాడిన అధికారులు... సోదాలకు సహకరించాలని కోరారు. రంగబాబు, ఇంట్లో ఉన్నవారి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. రాయపాటి ఇంట్లో అణువణువూ గాలిస్తున్నారు. ఇంటి ప్రాంగణంలోని కార్లు, నివాసం ముందు నిలిపి ఉంచిన కార్లలోనూ తనిఖీలు చేశారు.

సీబీఐ అధికారుల సోదాలకు సంబంధించి రాయపాటి సాంబశివరావు తనయుడు రంగారావు స్పందించారు. ట్రాన్స్​ట్రాయ్ కంపెనీతో తమకు ఆర్థికపరమైన లావాదేవీలు ఏమీ లేవని... ఆ కంపెనీ బ్యాంకు రుణాలు ఎగవేస్తే తమకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. ప్రస్తుతం కంపెనీ సీఈవోగా ఉన్న శ్రీధర్... ఆ వ్యవహారాలకు బాధ్యత వహించాలన్నారు. సీబీఐకి పూర్తిగా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామంటున్న రంగారావుతో 'ఈటీవీభారత్' ప్రతినిధి ముఖాముఖి.

ఇవీ చూడండీ : కమిషనర్​తో నేనే మాట్లాడా.. దురుసుగా ప్రవర్తించారు: ఉత్తమ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.