ETV Bharat / city

Viveka murder case: వివేకా హత్య కేసులో.. ఇద్దరు అనుమానితులను ప్రశ్నిస్తున్న సీబీఐ - వివేకా హత్య కేసు తాజా వార్తలు

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు.. కీలక దశకు చేరుకుంది. వరుసగా 38వ రోజు విచారణ కొనసాగిస్తున్న సీబీఐ... ఇద్దరు అనుమానితులను ప్రశ్నిస్తోంది. ఏపీలోని కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో వివేకా ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డిని, పులివెందులకు చెందిన సిద్దారెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

Viveka murder case: వివేకా హత్య కేసులో.. ఇద్దరు అనుమానితులను ప్రశ్నిస్తున్న సీబీఐ
Viveka murder case: వివేకా హత్య కేసులో.. ఇద్దరు అనుమానితులను ప్రశ్నిస్తున్న సీబీఐ
author img

By

Published : Jul 14, 2021, 1:13 PM IST

ఏపీవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వివేకా హత్య కేసు విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. విచారణను వేగవంతం చేసిన సీబీఐ అధికారులు.. 38వ రోజు ఇద్దరు అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో వివేకా ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డిని, పులివెందులకు చెందిన సిద్దారెడ్డిని సీబీఐ అధికారులు విచారణ చేస్తున్నారు.

హత్య జరిగిన రోజు సాక్ష్యాలు తారుమారు చేశారనే కేసులో రెండేళ్ల కిందట ఎర్రగంగిరెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం బెయిలుపైన ఉన్న వీరిని సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఘటన రోజు ఏం జరిగిందన్న విషయంపై.. మరింత స్పష్టత వచ్చే దిశగా కీలక సమాచారాన్ని రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

వివేకా హత్య కేసును సవాలుగా తీసుకున్న సీబీఐ అధికారులు విచారణలో దూకుడు పెంచారు. గత 38 రోజులుగా పలువురు అనుమానితులను విచారించారు. ఈ కేసులో అధికారులు కీలక ఆధారాలు సేకరిస్తున్నారు. 2019 మార్చి 15న వివేకా దారుణహత్యకు గురికాగా..మార్చి 14 అర్ధరాత్రి పులివెందులలో అనుమానాస్పదంగా తిరిగిన పలు వాహనాల వివరాలను సేకరించి ఆ దిశగా విచారణ చేపట్టారు.

పులివెందులలోని వివేకా ఇంటి సమీపం నుంచి రింగురోడ్డు మీదుగా పార్నపల్లె వైపు పలు వాహనాలు తిరిగినట్లు అధికారులు సమాచారం సేకరించారు. కొన్ని వాహనాలు నంబర్ ప్లేటు లేకుండా... మరికొన్ని నంబర్ ప్లేటుతో తిరిగినట్లు తేలింది. అయితే ఆ వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ వివరాలు, ఎవరి పేరుతో ఉన్నాయి... ఆ సమయంలో ఎక్కడెక్కడ తిరిగాయనే వివరాలను సీబీఐ అధికారులు సేకరిస్తున్నారు. దీంతోపాటు ఆ నంబర్ ప్లేటు లేని వాహనాలు, నంబర్ ప్లేటు కల్గిన వాహనాలు అసలు యజమాని ఎవరనేది ఆరా తీస్తున్నారు.

ఇదీ చదవండి: Viveka murder case: సాక్ష్యాలుంటే ఇవ్వాలంటూ సునీతకు లాయర్ లేఖ!

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.