అక్రమాస్తుల కేసులో ముఖ్యమంత్రి జగన్ హాజరుకు హైదరాబాద్ సీబీఐ కోర్టు ఇవాళ మినహాయింపు ఇచ్చింది. సీఎంగా పలు కార్యక్రమాలకు హాజరు కావాల్సి ఉన్నందున.. మినహాయింపు ఇవ్వాలన్న జగన్ అభ్యర్థనను న్యాయస్థానం మన్నించింది. ఈ కేసులో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి కోర్టుకు హాజరయ్యారు. జగన్ దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్లపై వాదనలు కొనసాగాయి. ముగ్గురు పారిశ్రామికవేత్తల నుంచి మోసపూరితంగా జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులు పెట్టించారన్న కేసులో జగన్‌కు ఎలాంటి ప్రమేయం లేదని న్యాయవాది అశోక్‌రెడ్డి వాదించారు. వాదనల అనంతరం విచారణను సీబీఐ న్యాయస్థానం మార్చి 6వ తేదీకి వాయిదా వేసింది.
జగన్ అక్రమాస్తుల కేసు విచారణ మార్చి 6కి వాయిదా - cbi case against jagan news
జగన్ అక్రమాస్తుల కేసు విచారణను సీబీఐ న్యాయస్థానం మార్చి 6వ తేదీకి వాయిదా వేసింది. సీఎంగా పలు కార్యక్రమాలకు హాజరు కావాల్సి ఉందన్న జగన్ అభ్యర్థనను మన్నించిన న్యాయస్థానం.. ఇవాళ హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది. ఈ కేసులో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి కోర్టుకు హాజరయ్యారు.
![జగన్ అక్రమాస్తుల కేసు విచారణ మార్చి 6కి వాయిదా cm ys jagan-cbi court](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6236320-706-6236320-1582890521318.jpg?imwidth=3840)