ETV Bharat / city

CBI COURT: జగన్​ కోర్టు ధిక్కరణ పిటిషన్​పై నేడు సీబీఐ కోర్టు విచారణ - Contempt petition filed by MP Raghuram

అక్రమాస్తుల కేసులో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు సంబంధించి సాక్షి వెబ్​ మీడియా ట్వీట్​పై ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌(Contempt petition on Sakshi web)పై సీబీఐ కోర్టు.. నేడు విచారణ చేపట్టనుంది.

CBI COURT: కోర్టు ధిక్కరణ కేసులో విచారణ నేటికి వాయిదా

author img

By

Published : Sep 14, 2021, 5:27 AM IST

Updated : Sep 14, 2021, 9:46 AM IST

అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడైన ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసిందంటూ.. సాక్షి వెబ్‌ మీడియాలో(Contempt petition on Sakshi web) ట్వీట్‌ చేయడంపై ఎంపీ రఘురామకృష్ణరాజు(MP Raghuram Krishnaraju) దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌(Contempt petition filed by MP Raghuram )పై సీబీఐ కోర్టు(cbi court) నేడు విచారణ చేపట్టనుంది. కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై సీబీఐ ప్రధాన కోర్టు న్యాయమూర్తి బీఆర్​ మధుసూదన్‌రావు సోమవారం విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. గత నెల 25న విజయసాయిరెడ్డి బెయిల్‌ రద్దు చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై ఉదయం 10 గంటల 50 నిమిషాల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వాదనలు కొనసాగాయని గుర్తుచేశారు. ఇదే సమయంలో జగన్‌ బెయిల్‌ను రద్దు చేయాలంటూ పిటిషనర్‌ అంతకుముందు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేశారని సాక్షి వెబ్‌ మీడియాలో ట్వీట్ చేశారని పేర్కొన్నారు. దాన్ని చూసి సంబురాలు చేసుకున్నారన్నారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిందేనని.. అందువల్ల దీన్ని కోర్టు ధిక్కరణ(Contempt) కింద పరిగణించాలని కోరారు.

సాక్షి ప్రతినిధుల తరఫున సీనియర్‌ న్యాయవాది ఎస్‌.నిరంజన్‌ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఉద్దేశపూర్వకంగా తప్పుగా ఇస్తేనే కోర్టు ధిక్కరణ వర్తిస్తుందని చెప్పారు. వార్తా సేకరణలో భాగంగా పలు రకాలుగా వార్తలు అందుతుంటాయని, వాటిని ధ్రువీకరించుకోవాల్సి ఉందని చెప్పారు. అయితే ఆ సమయంలో ఉన్న ఉద్యోగి ధ్రువీకరించుకోకుండా వార్తను ఇచ్చారని.. ఈ కారణంగా రాజీనామా చేశారన్నారు. అనంతరం గంటలోపే ఆ సమాచారాన్ని తొలగించడంతో పాటు తప్పుగా ఇచ్చినందుకు చింతిస్తున్నామని చెప్పామని.. అయినా ఆ విషయాన్ని పిటిషనర్‌ పట్టించుకోవడం లేదన్నారు. ఉద్దేశపూర్వక ఉల్లంఘన కాదని అందువల్ల పిటిషన్‌ను కొట్టివేయాలని కోరారు. దీనిపై తదుపరి విచారణ నేటికి వాయిదా పడింది. విచారణ సందర్భంగా కోర్టు ధిక్కరణ కేసులో ప్రతివాదులైన సాక్షి ఎడిటర్‌ మురళీ, సీఈఓ వినయ్‌ మహేశ్వరి హాజరయ్యారు.

హెటిరో, అరబిందోలో జగతి డిశ్చార్జి పిటిషన్‌..

తెలంగాణలోని మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల వద్ధ హెటిరో, అరబిందో ఫార్మలకు భూమిని లీజుకివ్వడానికి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ నమోదు చేసిన కేసులో నుంచి తప్పించాలని కోరుతూ జగతి పబ్లికేషన్స్‌(Jagati Publications‌).. సోమవారం సీబీఐ కోర్టులో డిశ్చార్జి పిటిషన్‌ దాఖలు చేసింది. పెట్టుబడులకు సంబంధించి ఎలాంటి అక్రమాలు జరగలేదని పేర్కొంది. పెన్నాకు సంబంధించి సీబీఐ నమోదు చేసిన కేసుపై ఈ నెల 23కు రాంకీ, జగతి పబ్లికేషన్స్‌, వాన్‌పిక్‌, దాల్మియాలపై సీబీఐ కేసుల విచారణను 16కు వాయిదా వేసింది. గృహ నిర్మాణ ప్రాజెక్టులకు సంబంధించిన కేసులో హైకోర్టులో స్టే ఉందని నిందితుడైన వై.వి.సుబ్బారెడ్డి తరపు న్యాయవాది ఎన్‌.నవీన్‌కుమార్‌ చెప్పడంతో దానికి సంబంధించిన వివరాలు సమర్పించడానికి సీబీఐ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ గడువు కోరడంతో విచారణ నేటికి వాయిదా పడింది.

ఇదీ చదవండి.. CM KCR: దశల వారీగా రాష్ట్రమంతా దళితబంధు.. ఏటా బడ్జెట్​లో కేటాయింపులు

Last Updated : Sep 14, 2021, 9:46 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.