ETV Bharat / city

NARA LOKESH: నారా లోకేశ్‌పై పాత గుంటూరు పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు - గుంటూరు పోలీస్‌స్టేషన్‌లో నారా లోకేశ్‌పై కేసు నమోదు

ఏపీలోని పాత గుంటూరు పోలీస్​ స్టేషన్​లో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్​పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. హత్యకు గురైన రమ్యశ్రీ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన లోకేశ్​ను అరెస్ట్​ చేసిన పోలీసులు సుమారు ఏడు గంటలకు పైగా అదుపులో ఉంచుకున్నారు.

NARA LOKESH
NARA LOKESH
author img

By

Published : Aug 17, 2021, 6:27 PM IST

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​పై పాత గుంటూరు పోలీస్ స్టేషన్​లో వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. రమ్యశ్రీ కుటుంబాన్ని పరామర్శించేందుకు.. సోమవారం నాడు గుంటూరు జిల్లాలో లోకేశ్ పర్యటించారు. ఆయన్ను అదుపులోకి తీసుకుని సాయంత్రం వదిలిపెట్టిన పోలీసులు.. లోకేశ్​పై 448/21 u/s 341,353,147,r/w 149 Ipc 120(b) Ipc సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఏపీ మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు, తెలుగుదేశం నేత నేత ధూళిపాళ్ల నరేంద్రతో పాటు.. ఇతర నాయకులపైనా కేసులు నమోదు చేశారు. కొత్తపేట పీఎస్​లో వివిధ సెక్షన్ల కింద ఈ కేసులు నమోదు అయ్యాయి.

ఏం జరిగిందంటే..

గుంటూరులో హత్యకు గురైన రమ్య మృతదేహం వద్ద నివాళులర్పించటానికి వచ్చిన తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలనూ అదుపులోకి తీసుకున్నారు. మధ్యాహ్నం 12.45కు లోకేశ్‌ను గుంటూరు నుంచి జీపులో తీసుకెళ్లి ప్రత్తిపాడు స్టేషన్‌లో ఉంచారు. సాయంత్రం 5.30 తర్వాత అక్కడి నుంచి పెదనందిపాడు మీదుగా పొన్నూరు, చేబ్రోలు, గుంటూరులో తిప్పి రాత్రి ఎనిమిదింటికి పెదకాకాని స్టేషన్‌కు తీసుకెళ్లి అక్కడ విడిచిపెట్టారు. లోకేశ్‌ మధ్యాహ్నం భోజనం చేయలేదు. ప్రత్తిపాడు నుంచి నేరుగా గుంటూరుకు 40 నిమిషాల్లో చేరుకుంటారని, అలాంటిది పెదకాకానికి తీసుకురావటానికి ఆయా ప్రాంతాల్లో తమను వాహనంలోనే తిప్పారని లోకేశ్‌ వెంటనున్న చిట్టిబాబు వివరించారు. అరెస్టు చేసినప్పటి నుంచి మొత్తంగా ఏడు గంటలకు పైగా లోకేశ్‌ పోలీసుల అదుపులోనే ఉన్నారు.

ఇదీచూడండి: Ramya Murder: అట్టుడికిన గుంటూరు.. రమ్య మృతదేహం తరలింపులో తీవ్ర ఉద్రిక్తత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.