ETV Bharat / city

'ఆలస్యం చేసినందుకు పోలీస్ కేసు తప్పలేదు'

నిబంధనలకు విరుద్ధంగా.. "అల వైకుంఠపురం" సినిమా మ్యూజికల్​ నైట్​ నిర్వహించారంటూ.. జూబ్లీహిల్స్ పీఎస్​లో పోలీసులు కేసు నమోదు చేశారు. కార్యక్రమానికి 6 వేల మందికి గాను 15 వేల మందిని ఆహ్వానించినట్లు సమాచారం.

author img

By

Published : Jan 9, 2020, 11:03 AM IST

Updated : Jan 9, 2020, 1:08 PM IST

case-filed-against-ala-vaikunthapuram-film-production-company
"అల వైకుంఠపురం" సినిమా నిర్మాణ సంస్థపై కేసు నమోదు

సమయం ముగిశాక కార్యక్రమం నిర్వహించడమే కాకుండా పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చారన్న కారణంగా శ్రేయాస్ మీడియా ఎండీ శ్రీనివాస్​పైతో పాటు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మేనేజర్ యగ్నేష్ పై హైదరాబాద్​ జూబ్లీహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు.

అసలేం జరిగిందంటే..!
ఈ నెల 6న సాయంత్రం యూసుఫ్​గూడ బెటాలియన్ పోలీస్ గ్రౌండ్​లో 'అల వైకుంఠపురం' సినిమా ప్రీ రిలీజ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో, హీరోయిన్లు అల్లు అర్జున్, పూజా హెగ్డేతో పాటు నిర్మాతలు అల్లు అరవింద్, చిన్నబాబు హాజరయ్యారు. ఈ నెల 2న హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మేనేజర్ కె. యగ్నేష్ పోలీసుల అనుమతి తీసుకున్నారు. దాదాపు 5 నుంచి 6వేల మంది హాజరవుతారని రాత్రి 10 గంటల వరకు కార్యక్రమం ముగుస్తుందని లేఖలో పేర్కొన్నాడు.

అయితే కార్యక్రమం నిబంధనలకు విరుద్ధంగా రాత్రి 11:30 గంటల వరకు కొనసాగింది. గంటన్నర అదనంగా కార్యక్రమాన్ని కొనసాగించడమే కాకుండా పోలీసులకు ఇచ్చిన దరఖాస్తులో ఆరువేల మందికి మాత్రమే పాస్​ ఇచ్చామని పేర్కొని దాదాపు 15వేల మందిని ఆహ్వానించినట్లు గుర్తించారు.

"నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలంటూ జూబ్లీహిల్స్ ఎన్ఏ నవీన్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రేయాస్ మీడియా ఎండీ శ్రీనివాస్​తో పాటు యగ్నేష్ పై కేసు నమోదు చేశారు"

నిబంధనలు ఉల్లంఘన

  1. వేడుకలో తొక్కిసలాట జరిగింది.
  2. వేలాదిగా అభిమానులు తరలివచ్చారు.
  3. యూసుఫ్ గూడ రహదారులు కిక్కిరిశాయి.. ట్రాఫిక్​ స్థంబించింది.
  4. పోలీసులు వీరిని నియంత్రించకపోవడం వల్ల పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

ఇవీ చూడండి: దర్బార్ క్రేజ్​: చెన్నైలో ఫ్యాన్స్ రచ్చ.. రచ్చ

Intro:Body:Conclusion:
Last Updated : Jan 9, 2020, 1:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.