గ్రేటర్ పరిధిలోని శిథిల భవనాలపై జీహెచ్ఎంసీ దృష్టిపెట్టింది. నివాసయోగ్యం కాని భవనాల కూల్చివేత ప్రారంభించింది. ఇప్పటివరకు 203 గృహాలను కూల్చివేయగా 192 ఇళ్లకు మరమ్మతులు చేయించినట్లు చీఫ్ సిటీ ప్లానర్ దేవేందర్ రెడ్డి తెలిపారు. మిగతా సంబంధిత యజమానులకు నోటీసులు జారీచేశామని పేర్కొన్నారు. నగరంలో 2016 సంవత్సరంలో 485 పాత ఇళ్లు, 2017 లో 294 పాత భవనాలు, 2018లో 402 నిర్మాణాలను కూల్చివేశామని ఆయన వివరించారు.
ఇదీ చూడండి :ఈసీఐఎల్‌లో "విశ్వ" రహస్యాలు