ETV Bharat / city

RSP on White Challenge :'బ్లాక్ అండ్ వైట్ ఛాలెంజీలు తన్నులాటలు, పరువు నష్టాల క్లైమాక్స్​కు వచ్చాయి'

మంత్రి కేటీఆర్ (KTR)​, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిల (Revanth Reddy) మధ్య నడుస్తున్న సవాళ్ల పర్వం (White Challenge) తారాస్థాయికి చేరింది. రేవంత్​ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్​ పరువునష్టం దావా వేశారు. రేవంత్ ఇంటి మట్టడికి తెరాస శ్రేణులు యత్నించాయి. ఈ మొత్తం వ్యవహారంపై బీఎస్పీ రాష్ట్ర కో ఆర్డినేటర్ ఆర్​ఎస్ ప్రవీణ్​ కుమార్ స్పందించారు. బ్లాక్ అండ్ వైట్ ఛాలెంజీలు తన్నులాటలు, పరువు నష్టాల క్లైమాక్స్​కు వచ్చాయని ట్వీట్ చేశారు. తెలంగాణ ఎటువైపు అంటూ ప్రశ్నించారు.

rs praveen kumar
rs praveen kumar
author img

By

Published : Sep 21, 2021, 7:57 PM IST

పీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి (Revanth Reddy), మంత్రి కేటీఆర్ (KTR)​ వైట్​ ఛాలెంజ్ (White Challenge)​, పరువు నష్టం దావా​పై బీఎస్పీ రాష్ట్ర కో ఆర్డినేటర్​ ఆర్​ఎస్​ ప్రవీణ్​ కుమార్ (RS Praveen Kumar) స్పందించారు. చివరికి మన బ్లాక్ అండ్ వైట్ ఛాలెంజీలు తన్నులాటలు, పరువు నష్టాల క్లైమాక్స్​కు వచ్చాయని ట్విట్టర్ వేదికగా అసహనం వ్యక్తం చేశారు. రైతుల కష్టాలు, పోడు, అసైన్డ్ భూములు, కుంభకోణాలు, నిరుద్యోగ సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసమే ఈ హైడ్రామా అని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ నువ్ ఎటు వైపు..? ఈ చెత్త ఛాలెంజీల వైపా..? లేక ఛిద్రమైన బతుకుల కోసం నిలబడ్డ బహుజనుల వైపా ..? అని ట్వీట్ చేశారు.

  • చివరికి మన బ్లాక్&వైట్ చాలెంజీలు తన్నులాటల,పరువు నష్టాల క్లైమాక్సుకొచ్చినయన్నమాట. రైతుల కష్టాలు, పోడు/అసైన్డ్ భూములు,కుంభకోణాలు,నిరుద్యోగ సమస్యల నుండి మన దృష్టి మళ్లించడం కోసమే ఈ హైడ్రామా! తెలంగాణ నువ్ ఎటు వైపు? ఈ చెత్త చాలెంజీల వైపా లేక చిద్రమైన బతుకుల కోసం నిలబడ్డ బహుజనుల వైపా?

    — Dr. RS Praveen Kumar (@RSPraveenSwaero) September 21, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

సంబంధిత కథనాలు : వైట్ ఛాలెంజ్ ఏంటి? రేవంత్​పై కేటీఆర్ పరువునష్టం దావా ఎందుకేశారు?

పరువునష్టం దావా

డ్రగ్స్​ పరీక్ష చేయించుకోవాలని మంత్రి కేటీఆర్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్​ రెడ్డికి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఇటీవల వైట్​ ఛాలెంజ్ (White Challenge) విసిరారు. దీనిపై కేటీఆర్​, రేవంత్​ రెడ్డి మధ్య మరోసారి ట్వీట్‌ వార్‌ కొనసాగింది. తనపై ఆరోపణలు చేస్తున్నవారిపై మండిపడ్డ కేటీఆర్​.. వదంతులు వ్యాప్తి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న దుష్ప్రచారంపై కోర్టులో పరువునష్టం దావా వేశారు. మాదకద్రవ్యాల కేసుతో ముడిపెడుతూ తప్పుడు ఆరోపణలు చేసి తన ప్రతిష్టకు భంగం కలిగించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. తప్పుడు ఆరోపణలు చేయకుండా నియంత్రిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత కథనాలు : బండి సంజయ్, ప్రవీణ్ కుమార్​కు వైట్ ఛాలెంజ్ విసురుతున్నా: కొండా

స్వీకరించిన బండి సంజయ్​

రేవంత్​ రెడ్డి (Revanth Reddy) విసిరిన వైట్​ ఛాలెంజ్​ను (White Challenge) స్వీకరించిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్​ రెడ్డి (Konda Vishweshwar Reddy) సోమవారం గన్​పార్క్ అమరవీరుల స్తూపం వద్దకు వచ్చారు. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు బైఠాయించాయి. వైట్​ ఛాలెంజ్​ను మంత్రి కేటీఆర్ స్వీకరించకపోవడం దురదృష్టకరమని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. తాను కూడా మరో ఇద్దరికి వైట్ ఛాలెంజ్ విసురుతున్నట్లు తెలిపారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు వైట్​ ఛాలెంజ్ విసిరారు. కొండ విశ్వేశ్వర్​ రెడ్డి సవాల్​ను బండి సంజయ్ స్వీకరించారు. అక్టోబర్​ 2న ప్రజా సంగ్రామ యాత్ర ముగిసిన తర్వాత ఎక్కడికైనా వస్తానని స్పష్టం చేశారు.

సంబంధిత కథనాలు : కొండా విశ్వేశ్వర్ రెడ్డి వైట్​ ఛాలెంజ్​కు సిద్ధం: బండి సంజయ్‌

బ్లూ ఛాలెంజ్​ కావాలి

కొండ విశ్వేశ్వర్ రెడ్డి విసిరిన వైట్​ ఛాలెండ్​పై (White Challenge) ఆర్​ఎస్​ ప్రవీణ్​ కుమార్ (RS Praveen Kumar) సోమవారం రాత్రి స్పందించారు. 'నేడు తెలంగాణకు కావల్సింది బలిసిన దొరల దందలు, డ్రగ్స్, గర్ల్ ఫ్రెండ్స్, బూతులు, బ్లాక్/వైట్ ఛాలెంజ్'లు కాదన్నారు. బ్లూ ఛాలెంజ్​ కావాలని స్పష్టం చేశారు. 'నేను అమరవీరుల స్తూపం సాక్షిగా పేదల కన్నీళ్లు తుడిచి, బహుజనులను ఏనుగు మీద ప్రగతి భవన్​కు తీసుకుపోయే పనిలో బిజీగా ఉన్నా. డోన్ట్​ డిస్టర్బ్​ మీ' అంటూ ట్వీట్ చేశారు.

  • @KVishReddy గారు నేడు తెలంగాణకు కావలసింది బలిసిన దొరల దందలు, డ్రగ్స్, గర్ల్ ఫ్రెండ్స్,బూతులు,బ్లాక్/వైట్ చాలెంజ్'లు కాదు. BLUE CHALLENGE కావాలి. నేను అమరవీరుల స్తూపం సాక్షిగా పేదల కన్నీళ్లు తుడిచి, బహుజనులను ఏనుగు మీద ప్రగతి భవన్ కు తీస్కపోయే పనిలో బిజీగ ఉన్న. Don’t disturb me.

    — Dr. RS Praveen Kumar (@RSPraveenSwaero) September 20, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

సంబంధిత కథనాలు : డ్రగ్స్ కేసుతో ముడిపెట్టి కేటీఆర్‌పై వ్యాఖ్యలు చేయవద్దని కోర్టు ఉత్తర్వులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.