పెళ్లిపీటలెక్కి నూతన జీవితంలోకి అడుగుపెట్టాల్సిన తరుణంలో ఫంక్షన్ హాల్‌లోనే పెళ్లి కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మేడ్చల్ జిల్లా కొంపల్లిలో ఈ దారుణం జరిగింది. దిల్‌షుక్‌నగర్‌కు చెందిన సందీప్ అనే యువకుడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. కొంపల్లిలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఇవాళ అతడి వివాహం జరగాల్సి ఉంది.
అయితే పెళ్లి ముహూర్తానికి ముందే అతడు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.