12 ఏళ్ల బాలుడి చెయ్యి క్రషర్లో పడి తెగిపడిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్ల అనకాపల్లి మండలం కూడ్రం గ్రామంలో విషాదాన్ని నింపింది. కూడ్రం గ్రామానికి చెందిన శ్రీను, మంగ దంపతులకు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. తల్లిదండ్రులు కూలీ పనుల కోసం అచ్యుతాపురం గ్రామానికి వెళ్లారు. కుమారుడు పవన్‌కుమార్ ఆడుకుంటూ క్రషర్ వద్దకు వెళ్లాడు. వైబ్రేటర్ దగ్గర కన్వీనర్ బెల్టు తిరుగుతండగా... దీన్ని గమనిస్తూ కుడి చెయ్యి అందులో పెట్టాడు.
భుజం వరకు తెగిపడటంతో క్రషర్ సిబ్బంది అనకాపల్లిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేజీహెచ్‌కు తీసుకెళ్లారు. కుమారుడి పరిస్థితి చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు ఎస్సై రామకృష్ణారావు తెలిపారు.
ఇదీ చదవండి : రాష్ట్రంలోని అన్ని కళాశాలల్లో గార్డెన్లు ఏర్పాటవ్వాలి : కేసీఆర్