ETV Bharat / city

మాంజా... ఆ చిన్నారి పాలిట మృత్యువైంది...!

author img

By

Published : Nov 4, 2019, 11:03 PM IST

సెలవులు వచ్చాయంటే... పిల్లలు, విద్యార్థులకు గాలిపటాలు ఎగరవేయడం సరాదా. కానీ ఆ సరాదా ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. అభం శుభం తెలియని ఓ చిన్నారి ప్రాణాన్ని తీసింది. అప్పటివరకూ తండ్రితో అల్లారుముద్దుగా కబుర్లు చెప్పిన ఆ చిన్నారి... ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. కళ్లముందే కొడుకు రక్తమోడుతుంటే ఆ తండ్రి గుండె బద్ధలైంది. ఎవరిని నిందించాలో తెలియక... తన పరిస్థితి ఎవరికీ రాకూడదని మౌనంగా కుమిలిపోయాడు.

మాంజా... ఆ చిన్నారి పాలిట మృత్యువైంది...!

గాలిపటానికి ఉపయోగించే మాంజా గొంతుకు చిక్కుకొని మూడేళ్ల బాలుడు మృతి చెందాడు. చెన్నై కొండి తోపుకు చెందిన గోపాల్ కుటుంబ సమేతంగా ద్విచక్ర వాహనంపై బంధువుల ఇంటికి బయలుదేరాడు. ద్విచక్ర వాహనం కొరుకుపేట ప్రాంతంలోని రైలు వంతెనపైన వెళ్తున్న సమయంలో... ఒక్కసారిగా గాలిపటం దారం (మాంజా) గోపాల్ మూడేళ్ల కుమారుడు అభినేశ్వర్​రావు గొంతుకు చిక్కుకుంది. బైకు వేగంగా వెళ్తుండడం వలన గొంతుకు చిక్కుకున్న దారం బిగుసుకుని.. పిల్లాడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. స్థానికుల సాయంతో పిల్లాడిని చెన్నై స్టాన్లీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రిలోని అత్యవసర చికిత్స విభాగంలో వైద్యం అందించారు.

మాంజా బలంగా ఉండడం వలన చిన్నారికి తీవ్రగాయమైందని... చికిత్స చేసినా ఫలితం లేకపోయిందని వైద్యులు తెలిపారు. చిన్నారి అభినేశ్వర్ ఆసుపత్రిలో కన్ను మూశాడు. గోపాల్ ఫిర్యాదు మేరకు చెన్నై ఆర్కేనగర్ పోలీసులు కేసు నమోదుచేశారు. ఘటనకు సంబంధించి కొరుకుపేట ప్రాంతంలో ఇంజినీరింగ్ విద్యార్థి నాగరాజ్, పదో తరగతి చదువుతున్న మరో విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు. దారానికి మాంజా అనే మిశ్రమాన్ని దట్టించి ఎండబెడతారని అందువల్ల దారం తొందరగా తెగిపోదని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి.

ఇదీ చదవండి :

అభ్యర్థులు టవరెక్కింది ​సిగ్నల్​ కోసం కాదు... ఉద్యోగం కోసం..

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.