ETV Bharat / city

BOTSA ON PAWAN KALYAN : 'నోరుందని పవన్​కల్యాణ్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా?' - Minister Botsa comments on Pawan

నోరుందని పవన్​కల్యాణ్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా

author img

By

Published : Sep 26, 2021, 2:29 PM IST

14:12 September 26

BOTSA ON PAWAN KALYAN : 'నోరుందని పవన్​కల్యాణ్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా?'

నోరుందని పవన్​కల్యాణ్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా

సినిమా టికెట్ల విషయంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్(bosta sathyanarayana comments on pawan kalyan) చేసిన వ్యాఖ్యల​పై ఏపీ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ(minister bosta sathyanarayana) మండిపడ్డారు. సినిమా టికెట్ల ధరలను ఇష్టానుసారంగా పెంచి ప్రజలపై భారం వేస్తుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలా అంటూ వ్యాఖ్యానించారు. ఈ మేరకు విజయనగరంలో మీడియాతో బొత్స మాట్లాడారు. సినిమా టికెట్ల విషయం(bosta comments on cenima tickets issue )లో నియంత్రణ లేకుండాపోతోందన్నారు. జీఎస్టీ లాంటి పన్నులను స్ట్రీమ్ లైన్ చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం అన్నారు. 

సినిమా టికెట్ల ఆన్​లైన్(online cinema tickets) అమ్మకాల విధానాన్ని సినిమా డిస్ట్రిబ్యూటర్లే అడిగారు.. వాళ్లకు లేని బాధ పవన్​కు ఎందుకని ప్రశ్నించారు. వైకాపా మంత్రులు సన్నాసులంటూ.. నోరుందని పవన్ ఇష్టానుసారంగా మాట్లాడతారా అంటూ ధ్వజమెత్తారు. సినిమా ఇండస్ట్రీ(bosta on cenima tickets)లో ఏమైనా ఇబ్బందులుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్నారు. పరిశ్రమలో పవన్ ఒక్కరే లేరు కదా.. చాలామంది ఉన్నారు. చిరంజీవి, మోహన్​బాబులాంటి పెద్దలు ప్రభుత్వంతో సంప్రదించవచ్చునని పేర్కొన్నారు. ఇది రిపబ్లిక్ ఇండియా.. మీ ఇష్టానుసారంగా ఉండటం కుదరదు అని పవన్​ను ఉద్దేశించి అన్నారు. 

ప్రైవేటు పెట్టుబడితో సినిమా తీస్తే ప్రభుత్వం పెత్తనం ఏంటి ?: పవన్​

 'రాష్ట్రంలో సినిమాలు ఆపేసి లక్షల మంది పొట్ట గొడుతున్నారు. పవన్‌కల్యాణ్‌ సినిమా(pawan kalyan on cinema tickets in ap)ను ఆపేసినా, అతనొచ్చిన చిత్ర పరిశ్రమని ఆపేసినా అందరూ భయపడిపోయి.. తమ దగ్గరికొస్తారని వైకాపా నాయకులు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. చిత్ర పరిశ్రమ వైపు కన్నెత్తి చూస్తే కాలిపోతారు జాగ్రత్త’ అంటూ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ హెచ్చరించారు. చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన సంపదను బ్యాంకుల్లో చూపించి, అప్పులు తెచ్చుకోవాలనే సినిమా టికెట్ల(pawan on cinema tickets)పై పెత్తనం చెలాయించేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. సీనియర్‌ నటుడు మోహన్‌బాబు సహా పరిశ్రమలో ప్రతి ఒక్కరూ స్పందించి, జరుగుతున్న అన్యాయంపై గళమెత్తాలని పిలుపునిచ్చారు. శనివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ‘రిపబ్లిక్‌’ సినిమా ముందస్తు విడుదల వేడుకకు పవన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

కనికరం చూపాలి..

‘సాయితేజ్‌ ప్రమాదానికి గురైతే చాలామంది సానుభూతి తెలిపారు. ఇదే సమయంలో మీడియాలో కొద్దిమంది నిర్లక్ష్యంగా వెళ్లాడని, ఎక్కువ వేగంతో వెళ్లాడని ప్రోగ్రామ్స్‌ చేశారు. అలా చేసే వ్యక్తులు కొంచెం కనికరం చూపించాలని కోరుతున్నా. ఇలాంటి కథనాల కంటే... వై.ఎస్‌.వివేకానందరెడ్డి ఎందుకు హత్యకి గురయ్యారో మాట్లాడితే బాగుంటుంది. కోడి కత్తితో ఒక నాయకుడిని అంతర్జాతీయ విమానాశ్రయంలో పొడిచారు. అప్పటి గవర్నర్‌ నరసింహన్‌ కూడా భారీ కుట్ర ఉందని చెప్పారు. అది ఏమైందని అడగండి. లక్షలాది ఎకరాల్లో గిరిజనులు పోడుభూముల్లో వ్యవసాయం చేసుకుంటుంటే అది వాళ్లకి దక్కడం లేదు. అదెందుకో దాని గురించి మాట్లాడండి. ఇడుపులపాయలో నేలమాళిగలో టన్నులకొద్దీ డబ్బులు ఉంటాయని చెబుతుంటారు. దానిపై కథలు నడపండి. పొలిటికల్‌ క్రైమ్‌ గురించి మాట్లాడండి. సినిమావాళ్ల గురించి కాదు’ అని వ్యాఖ్యానించారు.  

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.