రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మైనార్టీల భద్రత, సంక్షేమానికి కట్టుబడి ఉన్నారని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఉర్దూను రెండో అధికార భాషగా గుర్తించి ప్రభుత్వం.. దాన్ని ఔన్నత్యాన్ని కాపాడుతోందని తెలిపారు. కేసీఆర్కు ఉర్దూపై మంచి పట్టు ఉందని చెప్పారు.
భాగ్యనగర సమగ్ర చరిత్రపై ఉర్దూ అకాడమీ ముద్రించిన శౌకత్-ఇ-ఉస్మానియా పుస్తకాన్ని మంత్రి కొప్పుల ఆవిష్కరించారు. 250 ఫొటోలతో కూడిన చరిత్రను పరిశోధకుడు ఎజాజ్ రచించారు. హైదరాబాద్ చరిత్రపై వివరణాత్మక పుస్తకాన్ని రచించిన వారిని మంత్రి అభినందించారు. ఆకర్షణీయంగా, అర్థవంతంగా ఉన్న ఈ పుస్తకం విద్యార్థులు, చరిత్రకారులకు ఉపయోగకరంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
- ఇదీ చదవండి : లోటస్పాండ్లో దీక్ష కొనసాగిస్తున్న వైఎస్ షర్మిల