తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆవరణలో నాటుబాంబులు పేలడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. యూనివర్సిటీ ప్రాంగణంలోని ఐ బ్లాక్ సమీపంలో రెండు నాటుబాంబులు పేలాయి. ఈ ఘటనలో అక్కడే ఉన్న ఓ శునకం, పంది మృతి చెందాయి.
అప్రమత్తమైన క్యాంపస్ పోలీసులు వెంటనే తనిఖీలు నిర్వహించారు. అడవి పందుల కోసం వేటగాళ్లు బాంబులు పెట్టినట్లు గుర్తించారు. దీనికి సంబంధించి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి నిరాహార దీక్ష