TRAI's Silver Jubilee : టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా విజయవంతంగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా.. మరోవైపు 75 వసంతాల స్వాతంత్య్రాన్ని పురస్కరించుకుని ట్రాయ్ తన ప్రాంతీయ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది. ట్రాయ్ అడ్వైజర్ మునిశేఖర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ట్రాయ్ ఉద్యోగులు, అధికారులు, బీఎస్‌ఎన్‌ఎల్, వొడాఫోన్, ఐడియా తదితర సంస్థల ఉద్యోగులు ఇందులో పాల్గొని రక్తదానం చేశారు.
TRAI Silver Jubilee : రక్తదాన శిబిరాన్ని అనూహ్య స్పందన వచ్చిందని మునిశేఖర్ అన్నారు. మొత్తం 70 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు తెలిపారు. తలసేమియా, హెచ్‌ఐవీతో బాధ పడుతున్న రోగులకు ఈ రక్తం ఉపయోగించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన వారికి మునిశేఖర్ కృతజ్ఞతలు తెలిపారు. దీనికి సహకరించిన రెడ్ క్రాస్ సొసైటీ డాక్టర్ నాగు బృందానికి ధన్యవాదాలు తెలిపారు.