ETV Bharat / city

ఆదర్శం... అంధ బాలికల ఖురాన్​ పఠనం - hyderabad latest news

పుట్టుకతో వాళ్లు అంధులు. కానీ... నేర్చుకోవాలన్న తపన ముందు ఆ లోపం వారికి ఏమాత్రం అడ్డురాలేదు. బ్రెయిలీ లిపిని నేర్చుకుని... తమ పవిత్ర గ్రంధమైన ఖురాన్​ను ఎలాంటి ఉచ్ఛారణ లోపం లేకుండా పఠిస్తూ... అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. జనవరి 4 న అంధుల దినోత్సవం సందర్భంగా... హైదరాబాద్​కు చెందిన ముగ్గురు అంధ బాలికల ప్రతిభను పలువురు అభినందిస్తున్నారు.

blind girls reading quran in hyderabad chaderghat

author img

By

Published : Jan 3, 2021, 10:39 PM IST

Updated : Jan 3, 2021, 10:52 PM IST

ఆదర్శం... అంధ బాలికల ఖురాన్​ పఠనం

నేర్చుకోవాలన్న సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చని హైదరాబాద్​కు చెందిన అంధ అమ్మాయిలు నిరూపిస్తున్నారు. ఖమర్ ఫాతిమా, నజిశ్​ బేగం, జుహా ఫాతిమా పుట్టుకతోనే అంధులు. చాదర్​ఘాట్ ఐడియల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఫర్ డిజబులిటీ (ఐఐసీడీ) పాఠశాలలో బ్రెయిలీ లిపి నేర్చుకుని అరబీలోని ఖురాన్​ను చక్కగా పఠిస్తున్నారు.

ప్రపంచమంతా చీకటి అయినా... దేవుడిచ్చిన దివ్యకాంతితో ముందుకు వెళుతున్నామని ఈ బాలికలు చెబుతున్నారు. బ్రెయిలీ లిపిలో ఖురాన్ చదవడం నేర్చుకుని... ఎటువంటి ఉచ్ఛారణ లోపాలు లేకుండా పఠిస్తూ... అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. అంధులైనా ఖురాన్​ను చక్కగా పఠిస్తున్న ఈ బాలికలను అందరూ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు.

ఇదీ చూడండి: ఆరేళ్ల బాలికపై కీచకుల అత్యాచారయత్నం

Last Updated : Jan 3, 2021, 10:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.