కేసీ రావు, కేటీ రావు కుటుంబ పాలనలో... ప్రజలకు ఏమీ రావు అని కర్ణాటక ఎంపీ, భాజపా యువమోర్చా జాతీయాధ్యక్షుడు తేజస్వీ సూర్య ఎద్దేవా చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా... ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల వద్ద ప్రసంగించారు. ఉద్యోగాల కోసం కొట్లాడిన యువత... ఇంకా నిరుద్యోగులుగానే మిగిలిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కలిసికట్టుగా తెరాసకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్య నిర్వచనాన్నే మార్చేశారని తేజస్వీ విమర్శించారు. తెరాస చేస్తామన్న బంగారు తెలంగాణలో... బంగారమంతా ఆ పార్టీ నేతల జోబుల్లోకే వెళ్లిందని మండిపడ్డారు. హైదరాబాద్లో భాజపా అభ్యర్థులను గెలిపించాలని ఆయన సూచించారు. అమరవీరు స్థూపానికి నివాళులు అర్పించేందుకు వస్తే... పోలీసులు అడ్డుకోవడమేంటని ప్రశ్నించారు. తెలంగాణ పోలీసులు సీఎం కనుసైగల్లో పనిచేస్తున్నారని ఆరోపించారు.
ఇదీ చూడండి: కరోనాపై సమీక్ష: సీఎంలతో ప్రధాని మోదీ భేటీ