ETV Bharat / city

GO 317 : అరెస్ట్​ చేసిన టీచర్లను బేషరతుగా విడుదల చేయండి: బండి సంజయ్​ - teachers strike at pragathi bhavan

Bandi sanjay on GO 317: జీవో 317ను సవరించాలంటూ ప్రగతిభవన్​ వద్ద ఆందోళన చేపట్టిన టీచర్లను వెంటనే విడుదల చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ డిమాండ్​ చేశారు. లేకుంటే భాజపా తరఫున ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

bandi sanjay on  GO 317
bandi sanjay
author img

By

Published : Jan 15, 2022, 4:39 PM IST

Bandi sanjay on GO 317: 317 జీవోను సవరించాలంటూ ప్రగతిభవన్​ వద్ద శాంతియుతంగా ఆందోళన చేపట్టిన టీచర్లను అరెస్టు చేయడాన్ని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఖండించారు. అరెస్టు చేసిన టీచర్లందరినీ తక్షణమే బేషరతుగా విడుదలచేయాలని డిమాండ్​ చేస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల ‘స్థానికత’కు గొడ్డలిపెట్టుగా ఉన్న 317 జీవోను వెంటనే సవరించాలని డిమాండ్​ చేశారు. సవరించేదాకా ఉద్యోగ, ఉపాధ్యాయులు చేసే ఉద్యమానికి భాజపా అండగా ఉంటుందని బండి సంజయ్​ స్పష్టం చేశారు. తాము చేస్తున్న పోరాటాలను ఉద్ధృతం చేస్తామని తెలిపారు.

50 మంది అరెస్ట్​..

ఈనెల 12న దంపతులకు ఒకేచోట పోస్టింగ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయులు ప్రగతిభవన్ ఎదుట నిరసన చేపట్టారు. జీవో 317 కింద చేపట్టిన బదిలీల్లో భార్యాభర్తలను పరిగణలోకి తీసుకుని ఒకేచోట పోస్టింగ్​ ఇవ్వాలని డిమాండ్​ చేస్తూ ప్రగతి భవన్​ ముట్టడికి యత్నించారు. అప్రమత్తమైన పోలీసులు అడ్డుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆందోళన చేస్తున్న 50 మంది టీచర్లను అరెస్టు చేశారు.

ఇదీచూడండి: బదిలీలపై ఉపాధ్యాయ దంపతుల ఆందోళన.. 50 మంది అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.