ETV Bharat / city

Bandi Sanjay Speech: దేశ ప్రజల పాలిట దేవుడు.. మోదీ..: బండి సంజయ్‌

Bandi Sanjay Speech: సికింద్రాబాద్​ పరేడ్​గ్రౌండ్​లో నిర్వహించిన భాజపా విజయ సంకల్ప సభలో ప్రసంగించిన బండి సంజయ్​.. కేసీఆర్​పై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్‌ ప్రభుత్వం వచ్చేలా ప్రజలు మద్దతివ్వాలన్నారు. అందుకోసం ప్రతీ ఒక్కరు బాధ్యత తీసుకోవాలని కార్యకర్తలకు సూచించారు.

BJP State president Bandi sanjay praised modi and fire on KCR in Vijay sankalapa Sabha

author img

By

Published : Jul 3, 2022, 7:17 PM IST

Bandi Sanjay Speech: దేశ ప్రజల పాలిట దేవుడు.. నరేంద్ర మోదీ అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు. సికింద్రాబాద్​ పరేడ్​గ్రౌండ్​లో నిర్వహించిన భాజపా విజయ సంకల్ప సభలో ప్రసంగించిన బండి సంజయ్​.. కేసీఆర్​పై నిప్పులు చెరిగారు. ప్రధాని మోదీపై తెరాస నేతల విమర్శలు చూస్తే బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మోదీని ఎందుకు తిడుతున్నారో తెరాస నేతలు చెప్పాలని డిమాండ్​ చేశారు. రాజకీయ లబ్ధి కోసమే మోదీని కేసీఆర్ తిడుతున్నారని ఆరోపించారు.

పార్టీ శ్రేణులకు ధైర్యం కల్పించేందుకే ఇక్కడ కార్యవర్గ సమావేశాలు పెట్టామని వివరించారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా భాజపా కార్యకర్తలు వెనక్కి తగ్గలేదని బండి సంజయ్‌ తెలిపారు. త్వరలోనే కేసీఆర్‌ గడీలు బద్ధలుగొడతామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో అభివృద్ధి జరగాలని మోదీ పదేపదే చెబుతారని.. కానీ అందుకు తెరాస ప్రభుత్వం సహకరించడం లేదని వివరించారు. తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే.. భాజపా ప్రభుత్వం రావాలని స్పష్టం చేశారు. కేంద్రంలో మరో 20 ఏళ్లపాటు భాజపా సర్కారు ఉంటుందని ఉద్ఘాటించారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్‌ ప్రభుత్వం వచ్చేలా ప్రజలు మద్దతివ్వాలన్నారు. అందుకోసం ప్రతీ ఒక్కరు బాధ్యత తీసుకోవాలని సూచించారు.

"ప్రధాని మోదీపై తెరాస నేతల విమర్శలు చూస్తే బాధగా ఉంది. మోదీని ఎందుకు తిడుతున్నారో తెరాస నేతలు చెప్పాలి. కరోనా టీకాలు ఉచితంగా ఇచ్చినందుకా మోదీని తిట్టాలి? పేదప్రజలకు ఉచిత బియ్యం ఇస్తున్నందుకా మోదీని తిట్టాలా? ఉక్రెయిన్‌ నుంచి విద్యార్థులను తీసుకువచ్చినందుకా మోదీని తిట్టాలా? రాజకీయ లబ్ధి కోసమే మోదీని కేసీఆర్ తిడుతున్నారు. కొత్త రాష్ట్రం తెలంగాణకు కేంద్రం వేల కోట్ల నిధులు ఇస్తోంది. తెలంగాణలో అభివృద్ధి జరగాలని మోదీ పదేపదే చెబుతారు. తెలంగాణ అభివృద్ధికి తెరాస ప్రభుత్వం సహకరించడం లేదు. అందుకే తెలంగాణలో భాజపా ప్రభుత్వం రావాలి. డబుల్ ఇంజిన్‌ ప్రభుత్వం వచ్చేలా ప్రజలు మద్దతివ్వాలి. కేంద్రంలో మరో 20 ఏళ్ల పాటు భాజపా సర్కారు ఉంటుంది. త్వరలోనే కేసీఆర్‌ గడీలు బద్ధలుగొడతాం." - బండి సంజయ్​, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.