ETV Bharat / city

'పరీక్షల్లో ఫెయిలయితే జీవితం ముగిసినట్లు కాదు..'

Bandi sanjay on Inter results: విద్యార్థులు క్షణికావేశంలో నూరేళ్ల జీవితాన్ని పాడు చేసుకోవద్దని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్‌ కోరారు. పరీక్షల్లో ఫెయిలయితే జీవితం ముగిసినట్లు కాదని ఇంకా మంచి భవిష్యత్తు ముందు ఉంటుందని తెలిపారు.

Bjp state president Bandi sanjay on Inter students suicide

author img

By

Published : Jun 29, 2022, 6:00 PM IST

Bandi sanjay on Inter results: ఇంటర్‌లో ఫెయిల్‌య్యామని విద్యార్థులు ఆత్మహాత్య చేసుకోవటం మనసును తీవ్రంగా కలిచివేసిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్‌ అన్నారు. విద్యార్థులు క్షణికావేశంలో నూరేళ్ల జీవితాన్ని పాడు చేసుకోవద్దని ఆయన కోరారు. పరీక్షల్లో ఫెయిలయితే జీవితం ముగిసినట్లు కాదని ఇంకా మంచి భవిష్యత్తు ముందు ఉంటుందని బండి తెలిపారు. పిల్లలపైనే ఆశలు పెంచుకున్న తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చవద్దని పేర్కొన్నారు. విద్యార్థులకు నైతిక విలువలను అలవర్చడంతోపాటు జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేలా విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

"ఇంటర్ విద్యార్థులు క్షణికావేశంలో నూరేళ్ల జీవితాన్ని పాడు చేసుకోవద్దు. మీపై ఆశలు పెంచుకున్న తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చవద్దు. ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో ఫెయిలయ్యామననే బాధతో విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం మనసును తీవ్రంగా కలిచివేస్తుంది. పరీక్షల్లో తప్పినంత మాత్రాన జీవితం ముగిసినట్లు కాదు. సప్లమెంటరీ పరీక్షలు రాసే అవకాశాలున్నాయి. ఇకనైనా సీఎం కేసీఆర్ రాజకీయాలు పక్కనపెట్టి విద్యాశాఖపై దృష్టి పెట్టాలి. ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేయాలి. విద్యార్థులకు తగిన సౌకర్యాలు కల్పించాలి. నైతిక విలువలను అలవర్చడంతో పాటు జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేలా విద్యార్థులకు అవగాహన కల్పించేలా విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలి." - బండి సంజయ్​, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.