భాగ్యనగర ప్రజలను ఆదుకోవాలనే చిత్తశుద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉంటే ప్రతి డివిజన్‌లో ముంపు ప్రాంతాల్లో పర్యటించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. సర్వం కోల్పోయిన బాధితులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం... కేవలం పదివేల ఆర్థిక సాయం చేయడమేంటని ప్రశ్నించారు. వరద బాధితులను ఆదుకునేందుకు ఇచ్చే సాయం పార్టీదో... ప్రభుత్వానిదో స్పష్టం చేయాలన్నారు.
ప్రభుత్వ సాయాన్ని అధికారులు పంపిణీ చేయాలి కానీ తెరాస నాయకులు కాదని హితవు పలికారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్కు చెందిన తెరాస, కాంగ్రెస్ నాయకులను కండువా కప్పి పార్టీలోకి సంజయ్ ఆహ్వానించారు. ఎన్నికలు ఎక్కడ జరిగితే అక్కడికెళ్లి ప్యాకేజీలు ప్రకటించే ముఖ్యమంత్రి కేసీఆర్ దుబ్బాక ఎన్నికల ప్రచారానికి రావడానికి భయపడ్డారని ఎద్దేవా చేశారు. అబద్ధాలు, అవినీతిలో కేసీఆర్‌కు ఆస్కార్ ఇవ్వొచ్చన్నారు. విజయశాంతి ప్రజాదరణ ఉన్న నాయకురాలని... గ్రామాల్లోని ప్రజలను చైతన్యం చేశారని వ్యాఖ్యానించారు.
ఇదీ చూడండి: రెవెన్యూ అధికారిపై మహిళా రైతుల దాడి