జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాజపాకు సహకరించినందుకు నగర ప్రజలకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు కృషి చేసిన ఎన్నికల సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. అరాచకాలను ఎదుర్కొనే సమయంలో చాలా చోట్ల ఘర్షణలు జరిగాయని... ఓటర్లు పోలింగ్‌లో పాల్గొనకుండా చాలా ప్రయత్నాలు చేశారని ఆరోపించారు.
మత ఘర్షణల పేరుతో ఎన్నికలు వాయిదా వేయాలని తెరాస ప్రయత్నించినట్టు బండి సంజయ్ పేర్కొన్నారు. సంక్రాంతి వేళ ఏపీ ప్రజలు ఊళ్లకు వెళితే... ఇష్టారీతిన ఎన్నికలు నిర్వహించుకోవచ్చని అధికార పార్టీ భావించిందని ఆరోపించారు. గ్రేటర్ ఎన్నికల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులకు విధులు కేటాయించకుండా... అనుభవం లేని సిబ్బందితో నిర్వహించడం వల్ల అనేక చోట్ల ఇబ్బందులు ఎదురైనట్టు తెలిపారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారం ఎలా చేస్తారని ప్రశ్నించారు. జిల్లాల నుంచి వచ్చిన తెరాస ఎమ్మెల్యేలు, మంత్రులు, నాయకులు, కార్యకర్తలు ఇక్కడే ఉన్నారని మండిపడ్డారు.
ఇదీ చూడండి: ముగిసిన గ్రేటర్ పోలింగ్.. ఎల్లుండి ఓల్డ్ మలక్‌పేటలో రీపోలింగ్