ETV Bharat / city

'కేసీఆర్​ను శాశ్వతంగా ఫామ్​హౌస్​కే పరిమితం చేస్తాం' - డీకే అరుణ తాజావార్తలు

రాష్ట్రంలో ప్రతి అభివృద్ధి కార్యక్రమంలోనూ కేంద్రం నిధులు ఉన్నాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా డబ్బులు ఇవ్వట్లేదని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడంపై ఆయన తప్పుబట్టారు. భాజపా ద్వారానే రాష్ట్ర ప్రజలకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.

bjp-leders-bandi-sanjay-dk-aruna-fires-on-cm-kcr
'కేసీఆర్​ను శాశ్వతంగా ఫామ్​హౌస్​కే పరిమితం చేస్తాం'
author img

By

Published : Nov 9, 2020, 3:16 PM IST

తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన ఎంఐఎంతో దోస్తీ చేస్తున్న తెరాసను ప్రజలు బొంద పెడతారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హెచ్చరించారు. ప్రతి ఒక్క వర్గానికి తమ పార్టీ ద్వారానే న్యాయం జరుగుతుందని వెల్లడించారు. వరదలు వచ్చి ప్రజల అవస్థలు పడుతుంటే పట్టించుకోకుండా ముష్టి రూ.10వేలు ఇచ్చి సీఎం కేసీఆర్ ఓట్లు అడుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రతి అభివృద్ధి కార్యక్రమంలోనూ కేంద్రం నిధులు ఉన్నాయని ఆయన తెలిపారు.

అభివృద్ధి పేరు చెప్పి తెరాస ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని డీకే అరుణ విమర్శించారు. ఆ పార్టీపై నమ్మకం లేక ప్రజలు భాజపా వైపు చూస్తున్నారని వెల్లడించారు. రెండు గదుల ఇళ్లు ఒక్కటి కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా డబ్బులు ఇవ్వట్లేదని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరదలు వచ్చి ప్రజలు విలవిలలాడుతుంటే ఏ ఒక్క కాలనీకి ముఖ్యమంత్రి రాలేదని దుయ్యబట్టారు. త్వరలో కేసీఆర్​ను ప్రజలు శాశ్వతంగా ఫామ్ హౌస్​కే పరిమితం చేయనున్నారని వెల్లడించారు.

ఇవీచూడండి: రూ.313.65 కోట్ల వ్యయంతో లింక్ రోడ్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.