ETV Bharat / city

కేంద్ర బలగాలతో దుబ్బాక ఉప ఎన్నికలు నిర్వహించాలి: భాజపా

స్థానిక పోలీసులపై తమకు నమ్మకం లేదని కేంద్ర బలగాలతో దుబ్బాక ఉప ఎన్నికలు నిర్వహించాలని భాజపా నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి విజ్ఞప్తి చేశారు. ఇటీవల సిద్దిపేటలో చోటుచేసుకున్న ఘటనపై సీబీఐ విచారణ జరిపించి, సీపీని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

author img

By

Published : Oct 27, 2020, 8:06 PM IST

bjp leaders meet with state chief election officer on dubbaka elections
కేంద్ర బలగాలతో దుబ్బాక ఉప ఎన్నికలు నిర్వహించాలి: భాజపా

దుబ్బాక ఎన్నికలు కేంద్ర బలగాల ఆధ్వర్యంలో నిర్వహించాలని... భాజపా నాయకులు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్​ గోయల్​కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు భాజపా సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి, ఎమ్మెల్సీ రామచందర్​ రావు, భాజపా జాతీయ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఆంటోనీ రెడ్డి... సీఈవోతో భేటీ అయ్యారు. భాజపా కార్యకర్తలు, నాయకులు, రాష్ట్ర అధ్యక్షుడిపై వేధింపులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటీవల సిద్దిపేటలో చోటుచేసుకున్న ఘటనపై సీబీఐతో విచారణ జరిపించి, సిద్దిపేట సీపీని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించినట్టు నేతలు తెలిపారు.

దుబ్బాకలో తెరాస పతనానికి నాంది పడబోతోందని, అందుకే ఎలాగైనా గెలవాలని అక్రమాలకు పాల్పడుతున్నారని ఇంద్రసేనారెడ్డి ఆరోపించారు. స్టార్​ క్యాంపెయినర్​లు ఎక్కడైనా ప్రచారం చేసుకునే హక్కు ఉన్నప్పుడు... బండి సంజయ్​ను కరీంనగర్​కు, వివేక్​ వెంకటస్వామి, జితేందర్ రెడ్డిని హైదరాబాద్​కు ఎందుకు తరలించారని ప్రశ్నించారు. స్థానిక పోలీసులపై తమకు నమ్మకం లేదని, కేంద్ర బలగాలతో ఎన్నికలు నిర్వహించాలని కోరారు.

రఘనందన్ రావు, వారి బంధువుల ఇళ్లపై దాడిని అప్రజాస్వామిక చర్యగా ఎమ్మెల్సీ రాంచందర్ రావు అభివర్ణించారు. దుబ్బాక ఉపఎన్నికల్లో భాజపా నైతికంగా గెలిచిందన్నారు. పశ్చిమ బంగా లాంటి పరిస్థితి ఇక్కడ సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు కమిషనర్ తెరాస కార్యకర్తలా ప్రవర్తిస్తున్నారని... పోలీసు పరిశీలకుడిని నియమించి, సీపీని వెంటనే సస్పెండ్ చేయాలని వివరించారు.

ఇదీ చూడండి: కొనసాగుతున్న బండి సంజయ్‌ దీక్ష.. పార్టీ శ్రేణుల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.