ETV Bharat / city

BJP Leader Premender Reddy : 'మంత్రి హరీశ్​రావు క్షమాపణ చెప్పాలి' - ఈసీకి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఫిర్యాదు

హుజూరాబాద్​ ఉపఎన్నిక(Huzurabad by election 2021)లో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న తెరాస ఆగడాలను నియంత్రించాలని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి(BJP telangana state chief secretary premender reddy) ఈసీని కోరారు. తప్పుడు వీడియోలు సృష్టించి భాజపాను అభాసుపాలు చేస్తున్నారని మండిపడ్డారు. దళితబంధు విషయంలో భాజపాపై అసత్య ఆరోపణలు చేసిన మంత్రి హరీశ్ రావు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

BJP Leader Premender Reddy
BJP Leader Premender Reddy
author img

By

Published : Oct 29, 2021, 7:23 AM IST

హుజూరాబాద్​ ఉపఎన్నిక(Huzurabad by election 2021)లో తెరాస అధికార దుర్వినియోగాన్ని నియంత్రించాలని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి(BJP telangana state chief secretary premender reddy) ఈసీని కోరారు. నియోజకవర్గమంతా 144 సెక్షన్​ అమల్లో ఉన్నా.. తెరాస ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఇష్టారీతిన ప్రవర్తిస్తున్నారని లేఖ రాశారు. అంబులెన్సుల ద్వారా డబ్బు తరలిస్తూ గుట్టుచప్పుడు కాకుండా ఇంటింటికి ముట్టజెప్పుతున్నారని ఆరోపించారు. అంబులెన్సులను కూడా తనిఖీ చేసేందుకు కేంద్ర బలగాలకు అనుమతివ్వాలని కోరారు. పోలింగ్ ప్రక్రియలో పాల్గొనే సిబ్బందికి పార్టీలిస్తూ.. వారిని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని లేఖలో పేర్కొన్నారు.

ఈసీకి భాజపా నేత ప్రేమేందర్ రెడ్డి ఫిర్యాదు

తెరాస కార్యకర్తలు భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌ ఫొటో, కమలం పువ్వు గుర్తు ఉన్న కవర్‌లో నుంచి పది వేల రూపాయలు లెక్కించే తప్పుడు వీడియోలను సృష్టించి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారని ప్రేమేందర్‌ రెడ్డి(BJP telangana state chief secretary premender reddy) ఈసీ(Telangana state election commission)కి ఫిర్యాదు చేశారు. డబ్బులు లెక్కించే మహిళ ముఖం కనిపించకుండా వీడియోలు చిత్రీకరించి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. భాజపా అభ్యర్థిని అప్రతిష్ట పాలు చేసేందుకే తెరాస ఇలా చేస్తోందని మండిపడ్డారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వ్యక్తిని గుర్తించి క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని కోరారు.

దళితబంధు విషయంలో తనపై, భాజపాపై అసత్య ఆరోపణలు, దుష్ప్రచారం చేసిన రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు.. తన తప్పును ఒప్పుకుని తెలంగాణ ప్రజలకు, ఎస్సీ సమాజానికి క్షమాపణలు చెప్పాలని ప్రేమేందర్ రెడ్డి(BJP telangana state chief secretary premender reddy) డిమాండ్‌ చేశారు. దళిత బంధును ఆపివేయాలని భాజపా కోరలేదని హైకోర్టు స్పష్టం చేసిందన్న ఆయన.. ఆ పథకాన్ని హుజూరాబాద్​లో అమలు చేయడం ఇష్టంలేకే తమ పార్టీపై నింద వేస్తున్నారని విమర్శించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.