ETV Bharat / city

bjp corporators on attack: 'జీహెచ్​ఎంసీ కార్యాలయంపై ఎలాంటి దాడులు చేయలేదు' - ghmc mayor fires on bjp corporators

bjp corporators on attack:జీహెచ్​ఎంసీ కౌన్సిల్​ సమావేశాన్ని ఏర్పాటుచేసి.. సమస్యలను పరిష్కరించాలని భాజపా కార్పొరేటర్లు డిమాండ్​ చేశారు. జీహెచ్​ఎంసీ కార్యాలయంలో ఘటనకు పోలీసులే కారణమని ఆరోపణలు చేశారు.

bjp corporators on attack
ghmc bjp corporators
author img

By

Published : Nov 24, 2021, 8:47 PM IST

జీహెచ్​ఎంసీ కార్యాలయంలో తాము ఎలాంటి దాడులకు పాల్పడలేదని భాజపా కార్పొరేటర్లు (bjp corporators on attack) తెలిపారు. బల్దియా జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేయాలని, అభివృద్ధి పనులు పెండింగ్‌లో ఉన్నాయంటూ నిరసన మాత్రమే వ్యక్తం చేశామన్నారు. శాంతియుతంగా ప్రజాసమస్యలను మేయర్ విజయలక్ష్మి దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా.... పోలీసుల తోపులాట వల్ల పూలకుండీలు ధ్వంసమయ్యాయని పేర్కొన్నారు. జీహెచ్​ఎంసీ కార్యాలయంలో ఘటనకు పోలీసులే కారణమని ఆరోపణలు చేశారు.

నిన్న జరిగిన ఘటనలో ప్రజలూ పాల్గొన్నారని చెప్పిన భాజపా కార్పొరేటర్లు.. గ్రేటర్​ పరిధిలో ప్రజలకు అన్యాయం జరిగితే ఊరుకోమని స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధులపై కేసులు పెట్టడం సరికాదన్నారు. ఇప్పటికైనా కౌన్సిల్‌ సమావేశాన్ని నిర్వహించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

bjp corporators on attack: 'జీహెచ్​ఎంసీ కార్యాలయంపై తాము ఎలాంటి దాడులు చేయలేదు'

కఠిన చర్యలు తీసుకోవాలన్న కేటీఆర్​..

జీహెచ్​ఎంసీ కార్యాలయంపై భాజపా కార్పొరేటర్లు మంగళవారం చేసిన దాడిని మంత్రి కేటీఆర్ (KTR On BJP Corporators GHMC Protest) ఖండించారు. భాజపాకు చెందిన పోకిరీలు, దుండగులు కార్యాలయంలో దాడిచేశారన్న మంత్రి... ఇలాంటి చర్యలు సరికావన్నారు. గాడ్సే అభిమానులను గాంధీ మార్గంలో నడవమని కోరటం అత్యాశే అవుతుందని ఎద్దేవా చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా.... దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్‌ సీపీని కేటీఆర్‌ కోరారు. ఈ దాడి ఘటనను ఖండిస్తూ ట్వీట్ చేశారు.

'సమాజానికి గూండాయిజం నేర్పిస్తున్నారా..?'

GHMC Mayor On BJP Corporators Attack: గ్రేటర్ భాజపా కార్పొరేటర్లు సమాజానికి గూండాయిజం నేర్పిస్తున్నారా..? అని మేయర్‌ గద్వాల విజయలక్ష్మి ప్రశ్నించారు. జీహెచ్​ఎంసీ సమావేశాలే జరగడం లేదనే భాజపా కార్పొరేటర్ల ఆరోపణలు సరికాదన్నారు. దేశవ్యాప్తంగా కొవిడ్‌ మార్గదర్శకాలకు(covid regulations) అనుగుణంగా గతంలోనే వర్చువల్‌గా సమావేశాలు జరిపామన్నారు. ఈలోగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ వచ్చిందన్నారు.

ఇవీచూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.