ETV Bharat / city

'లా అండ్ ఆర్డర్ సమస్యలుంటే చర్యలేందుకు తీసుకోవట్లేదు?'

author img

By

Published : Nov 26, 2020, 4:30 PM IST

లా అండ్ ఆర్డర్ సమస్యలుంటే ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవటం‌ లేదని కిషన్​రెడ్డి ప్రశ్నించారు. పాతబస్తీలో రోహింగ్యాలు ఉన్నారన్న సమాచారం తమకుందని పేర్కొన్నారు. రాష్ట్ర సమస్యలను వదిలేసి కేటీఆర్ జాతీయ అంశాలను మాట్లాడటం చేతకానితనమని దుయ్యబట్టారు.

bjp central minister kishan reddy fire on cm kcr and ktr

భాజపాపై అసత్య ప్రచారంతో ప్రజలను తెరాస నేతలు ఆందోళనకు గురిచేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ వ్యవహార తీరు మార్చుకోవాలని సూచించారు. ఎన్నికల లబ్ధి పొందడం కోసం ప్రభుత్వ వ్యవస్థను ఉపయోగించుకోవడం సరికాదన్నారు. ఇతర పార్టీలపై బురద చల్లడం ఎంత వరకు సమంజసమో సీఎం ఆలోచించాలన్నారు. ఎన్నికల్లో లబ్ధి కోసం తెరాస నేతలు ఇతరులపై నిందలు మోపుతున్నారని మండిపడ్డారు.

ఇతర పార్టీలు, నేతలపైకి ప్రభుత్వ అధికారులను ముఖ్యమంత్రి ఉసిగొలుపుతున్నారు. భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాతే దేశంలో శాంతి నెలకొందని కిషన్‌రెడ్డి ఉద్ఘాటించారు. ఎక్కడా మతకలహాలు, కర్ఫ్యూలు లేవని వివరించారు. ప్రజలు భయపడేలా సీఎం కేసీఆర్‌ మాట్లాడవద్దని హితవు పలికారు. ఎటువంటి ఇబ్బందులు రాకుండా ప్రజలకు తాము అండగా ఉంటామని కిషన్‌రెడ్డి హామీ ఇచ్చారు.

లా అండ్ ఆర్డర్ సమస్యలుంటే ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవటం‌ లేదని కిషన్​రెడ్డి ప్రశ్నించారు. పాతబస్తీలో రోహింగ్యాలు ఉన్నారన్న సమాచారం తమకుందని పేర్కొన్నారు. రాష్ట్ర సమస్యలను వదిలేసి కేటీఆర్ జాతీయ అంశాలను మాట్లాడటం చేతకానితనమని దుయ్యబట్టారు. మహానాయకులు ఎన్టీఆర్, పీవీలను భాజపా గౌరవిస్తోందన్న కిషన్​రెడ్డి... తేజస్వీ సూర్యపై ఓయూ పోలీసులు కేసు నమోదు చేయటాన్ని ఖండిస్తున్నానన్నారు.

ఇదీ చూడండి: ల్​ఆర్​ఎస్ రద్దు, పాతబస్తీకి స్పెషల్ ప్యాకేజీ.. మేనిఫెస్టోలో భాజపా వరాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.