పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు భాజపా తన అభ్యర్థులను ప్రకటించింది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానానికి ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్‌రావుకే మరోసారి అవకాశం ఇచ్చింది. వరంగల్-నల్గొండ-ఖమ్మం అభ్యర్థిగా గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డిని బరిలో నిలిపింది.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థులు ఘనవిజయం సాధిస్తారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ధీమావ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై వారు ఆగ్రహంగా ఉన్నారని సంజయ్ అన్నారు. మోదీ ప్రభుత్వంపై విశ్వాసం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.
శాసనమండలి ఎన్నికల ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభం కానుంది. రెండు పట్టభద్రుల స్థానాల్లో నోటిఫికేషన్ జారీతో.. నామినేషన్లు స్వీకరిస్తారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ నియోజకవర్గానికి జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్, నల్గొండ-వరంగల్-ఖమ్మం నియోజకవర్గానికి నల్గొండ కలెక్టర్ రిటర్నింగ్ అధికారిగా ఉన్నారు. ఆయా కార్యాలయాల్లో నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 23 వరకు నామినేషన్ల దాఖలుకు గడువుంటుంది.
ఇవీచూడండి: రేపటి నుంచే ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ