పుట్టిన రోజంటే కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతాం.. లేదంటే స్నేహితులతో షికార్లు చేస్తాం.. కానీ ఆందుకు భిన్నంగా జన్మదిన వేడుకలు జరుపుకున్నాడు రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నానికి చెందిన నూతనగంటి వెంకటేష్.. వేగేశ్న ఫౌండేషన్‌లోని సుమారు 250 మంది దివ్యాంగ విద్యార్థులకు అన్నదానం చేశాడు. తనకు అతి ప్రియమైన కబడ్డీ ఆటలో వచ్చిన డబ్బునే అన్నదానానికి వినియోగించాడు.
సామాజిక కార్యక్రమాలతో పాటు క్రీడల్లోనూ ప్రవేశం ఉన్న వెంకటేష్ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో రాణించాడు. పుట్టిన రోజంటే వేలకు వేలు దుబారాచేసే ప్రస్తుత రోజుల్లో వెంకటేశ్ ప్రయత్నం అందరికీ ఆదర్శనీయం అని స్థానికులు కొనియాడారు.
ఇవీ చూడండి:'అయోధ్యలో స్తంభాలపై హిందూ దేవతలున్నారు'